మోదీ అమెరికా సభకు అనుకోని అతిథి

టెక్సాస్‌  సెప్టెంబర్ 15 PESMS  మీడియా సర్వీసెస్ : భారత ప్రధాని​ నరేంద్ర మోదీ వచ్చేవారం అమెరికా పర్యటనలో భాగంగా హూస్టన్‌ నగరంలో ప్రవాస భారతీయులతో సమావేశం కానున్నారు. హూస్టన్‌లోని స్వచ్ఛంద సంస్థ టెక్సాస్ ఇండియా ఫోరం (టీఐఎఫ్) ‘హౌడీ, మోదీ’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సెప్టెంబర్‌ 22న ఎన్ఆర్‌జీ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. దీనిని Read More …

పీఓకే నుంచి పాక్‌ వైదొలగాలి — బ్రిటిష్‌ ఎంపీ

లండన్‌  సెప్టెంబర్ 15 PESMS  మీడియా సర్వీసెస్ : జమ్ము కశ్మీర్‌ విషయంలో ఓ బ్రిటిష్‌ ఎంపీ భారత్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు. పాకిస్తాన్‌ తీరును ఎండగడుతూ తొలుత పాక్‌ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) నుంచి ఆ దేశం వైదొలగాలని డిమాండ్‌ చేశారు. జమ్ము కశ్మీర్‌ భారత్‌ అంతర్భాగమని బ్రిటన్‌ ఎంపీ బాబ్‌ బ్లాక్‌మన్‌ స్పష్టం చేశారు. ఐరాస తీర్మానాన్ని Read More …

నవంబర్‌ నుంచి రామ మందిర్‌ నిర్మాణం — బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి

లక్నో సెప్టెంబర్ 15 PESMS  మీడియా సర్వీసెస్ : అయోధ్యలో రామ మందిర నిర్మాణం నవంబర్‌ నుంచి ప్రారంభమవుతుందని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి పేర్కొన్నారు. సుప్రీం కోర్టులో సాగుతున్న రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంలో రామాలయానికి అనుగుణంగా సర్వోన్నత న్యాయస్ధానం నిర్ణయం వెలువడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రార్ధించే హక్కు పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక Read More …

తీహార్‌ జైల్లోనే చిదంబరం బర్త్‌డే

న్యూఢిల్లీ  సెప్టెంబర్ 15 PESMS  మీడియా సర్వీసెస్  : ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్ట్‌ అయిన కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం జైలు జీవితం తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో తీహార్‌ జైల్లోనే సోమవారం తన 74వ జన్మదినం జరుపుకోనున్నారు.1945లో తమిళనాడులోని శివగంగ జిల్లా కనదుకథన్‌లో జన్మించిన చిదంబరం సీబీఐ దర్యాప్తు చేస్తున్న ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ఈనెల Read More …

భోజన పథకం కార్మికుల వేతనం పెంచుతూ జీవో జారీ

అమరావతి  సెప్టెంబర్ 15 PESMS  మీడియా సర్వీసెస్ : మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు గౌరవ వేతనం 1000 నుంచి 3000 కు పెంచుతూ రాష్ట్ర్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోనే పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనాలు పెంచుతూ ఆదేశాలిచ్చారు. జీతాలు Read More …

బోటు ప్రమాద ఘటనపై సీఎం జగన్‌ సీరియస్‌

అమరావతి  సెప్టెంబర్ 15 PESMS  మీడియా సర్వీసెస్ : తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో బోటు ప‍్రమాద సంఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడిన సీఎం జగన్‌… యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను వినియోగించాలని, నేవీ, ఓఎన్‌జీసీ Read More …

అభివృద్ధి కోసమే అప్పులు — సిఎం కేసీఆర్‌

హైదరాబాద్  సెప్టెంబర్ 15 PESMS  మీడియా సర్వీసెస్ : బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు శాసనసభలో ఆదివారం ప్రసంగించారు. రాష్ట్రాభివృద్ధికోసమే అప్పులు చేస్తున్నామని స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్‌లో అప్పులు 40 శాతం ఉన్నాయని, అదేక్రమంలో రాష్ట్ర అప్పులు 21 శాతం ఉన్నాయని వెల్లడించారు. రాష్ట్ర అప్పులపై ప్రతిపక్షాలు ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు. Read More …

కాంగ్రెస్ పార్టీకి కర్ర రాజశేఖర్ గుడ్ బై

కరీంనగర్ టౌన్ సెప్టెంబర్ 15 PESMS  మీడియా సర్వీసెస్  : కరీంనగర్ జిల్లలో కాంగ్రెస్ పార్టీ సీటీ కాంగ్రెస్ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న కర్ర రాజశేఖర్ ఆదివారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.  ఒకటి రెండు రోజుల్లో మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో కె టి ఆర్ సమక్షంలో టి ఆర్ ఎస్ లో చేరనున్నట్లు ఆయన మీడియా ద్వారా Read More …

ఎంపి బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరికలు

కరీంనగర్ సెప్టెంబర్ 15 PESMS  మీడియా సర్వీసెస్  : కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం పలువురు బీజేపీ పార్టీ తీర్థ పుచ్చుకున్నారు. ఈ చేరికలలో  మాజీ సెస్ డైరెక్టర్ , మాజీ టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఏనుగుల కనకయ్య, మాజీ సర్పంచ్ జోగు రవీందర్, పలువురు తెరాస నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. Read More …

ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన లారీ ఒకరి మృతి

హుజూరాబాద్ సెప్టెంబర్ 15 PESMS  మీడియా సర్వీసెస్  : కరీంనగర్  జిల్లా హుజూరాబాద్ మండలం  తుమ్మనపల్లిలో ఆదివారం మద్యహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.. వివరాలలోకి వెళ్తే.. ఒక ద్విచక్ర వాహనం  తుమ్మనపళ్లి సమిపంలోకి రాగానే అటువైపుగా వస్తున్న లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొ  ఇద్దరికీ తీవ్ర గాయాలు అయినట్లు స్థానికులు Read More …