అక్రమ రిజిస్ట్రేషన్లలో బెజవాడదే పైచేయి

అమరావతి సెప్టెంబర్ 10 PESMS  మీడియా సర్వీసెస్ : మోసపూరిత, డబుల్‌ రిజిస్ట్రేష్రన్లలో విజయవాడ అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రం మొత్తమ్మీద ఇటీవల కాలంలో మొత్తం 282 తప్పుడు/డబుల్‌ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఫిర్యాదులు రాగా అందులో ఒక్క విజయవాడ రిజిస్ట్రేషన్‌ జిల్లాలోనే 84 ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 26 రిజిస్ట్రేషన్‌ జిల్లాలు ఉండగా ఆరింటిలో ఎలాంటి ఫిర్యాదుల్లేవు. మిగిలిన 20 రిజిస్ట్రేషన్‌ జిల్లాలను పరిశీలిస్తే విజయవాడలో 84, విశాఖపట్నంలో 39, ఒంగోలులో 27, చిత్తూరులో 24, అనంతపురంలో 20 అక్రమ రిజిస్ట్రేషన్లు నమోదైనట్లు ఫిర్యాదులున్నాయి. ఈ మొత్తం ఫిర్యాదులపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ విచారణ జరిపింది. 44 కేసులకు సంబంధించి ప్రాసిక్యూషన్‌ సాగుతోంది. కొన్ని పెండింగులో ఉండగా.. మరికొన్నింటిని రకరకాల మార్గాల్లో పరిష్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.