అవసరమైతే మళ్లీ లాక్‌డౌన్‌ — కేసీఆర్‌

హైదరాబాద్  జూన్ 28 PESMS మీడియా సర్వీసెస్‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మరోసారి లాక్‌డౌన్‌ విధించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్‌లో 15 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించాలని వైద్య, ఆరోగ్య శాఖ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. దీనిపై ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించినట్టుగా సమాచారం. అవసరమైతే హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్‌ విధించనన్నుట్టుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌లో కరోనా వైరస్ నియంత్రణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని రాబోయే మూడు, నాలుగు రోజుల్లో ఖరారు చేయనున్నట్టు చెప్పారు. జీహెచ్‌‌ఎంసీ పరిధిలో మరోసారి కొద్దిరోజుల పాటు లాక్‌డౌన్‌ విధించే ప్రతిపాదనపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు వెల్లడించారు. నగరంలో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అందరికీ వైద్యం అందించడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. కరోనా నియంత్రణ, చికిత్స, సంబంధిత అంశాలపై చర్చించేందుకు ఆదివారం ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రులు ఈటల రాజేందర్‌, కేటీఆర్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కర్యాదర్శి సోమేశ్‌కుమార్‌.. ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమీక్షలో కరోనా వ్యాప్తి, నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.