ఆర్టీసీ సమ్మె… కార్మికుల ఉద్యోగాలకు ఎసరు

హైదరాబాద్‌ అక్టోబర్ 08 PESMS  మీడియా సర్వీసెస్ : ఆర్టీసీ కార్మికులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ప్రకటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేసీఆర్‌.. సంస్థలో ఇక మిగిలింది1200 మంది ఉద్యోగులు మాత్రమే అని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం విధించిన గడువులోగా విధుల్లో చేరని వారిని ఇక ఉద్యోగులుగా గుర్తించమని సీఎం ప్రకటించారు. దీంతో ఆర్టీసీ కార్మికుల్లో ఆందోళన మొదలైంది. ఇక తమ ఉద్యోగాలు పోయినట్టేనని కొంతమంది కలవరపడుతున్నారు. ఇదిలావుడంగా సమ్మెపై ప్రభుత్వ ప్రకటనకు భయపడేదిలేదని, ఆందోళనను మరింత  ఉదృతం చేస్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. అయితే ఉద్యోగుల భవిష్యత్తులపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సీఎం ప్రకటనతో సమ్మె చేస్తున్నవారంతా ఉద్యోగాలు కోల్పోయినట్లేనా? కార్పొరేషన్ ఉద్యోగులను తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉందా? ఇలా అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అయితే గతంలో సమ్మె చేస్తున్న ఉద్యోగులపై తమిళనాడు ప్రభుత్వం కూడా ఇదే విధంగా వ్యవహరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.