ఈఎస్‌ఐ ‘డైరెక్టరేట్‌’పై విజిలెన్స్‌ దాడులు

అమరావతి అక్టోబర్ 08 PESMS  మీడియా సర్వీసెస్ :  విజయవాడలోని ఈఎస్‌ఐ డైరెక్టరేట్‌ కార్యాలయంలో సోమవారం విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గుంటూరు విజిలెన్స్‌ ఎస్పీ జాషువా, విజయవాడ విజిలెన్స్‌ ఎస్పీ వెంకటరెడ్డి, పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ వరదరాజులు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. ఆస్పత్రి వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు.. దాదాపు ఏడు గంటలకు పైగా విజిలెన్స్‌ ఎస్పీలు డైరెక్టరేట్‌ అధికారులను ప్రశ్నించినట్టు తెలిసింది. మందులు, ఫర్నిచర్, సర్జికల్‌ ఐటమ్స్, రీయోజన్స్‌ల కొనుగోలులో భారీ ఎత్తున అవకతవకలు చోటుచేసుకున్నట్టు తెలిసింది. ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు ఆస్పత్రిలో డాక్టర్లు పంపిన ఇండెంట్లకు బదులుగా అధిక కమిషన్‌లు ఇచ్చే మందులను బలవంతంగా కొనుగోలుచేసి.. భారీ మొత్తంలో నిల్వ ఉంచినట్టు సమాచారం. ఈఎస్‌ఐ బడ్జెట్‌ ఎంత? ఎన్ని కొనుగోలు చేస్తారు? వాటిని ఎలా వినియోగిస్తారని విజిలెన్స్‌ అధికారులు ఆస్పత్రి డైరెక్టరేట్‌ కార్యాలయ సిబ్బందిని ప్రశ్నించినట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.