ఉగ్రవాదంపై చర్యల్లో పాక్‌ విఫలం

న్యూఢిల్లీ అక్టోబర్ 08 PESMS  మీడియా సర్వీసెస్ : ఉగ్రవాదాన్ని అణచివేయడానికి, జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్ర సంస్థలకు ఆర్థిక సాయం అందకుండా అడ్డుకునే చర్యలు తీసుకోవడంలో పాకిస్తాన్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌) తాజా నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయంగా మనీలాండరింగ్‌ కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు నివేదికలు అందించే ఈ సంస్థ ఐక్యరాజ్య సమితి భద్రతామండలి తీర్మానాలన్నీ పాక్‌ తుంగలో తొక్కిందని మండిపడింది. హఫీజ్‌ సయీద్‌తో పాటుగా ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదిగా ముద్ర వేసిన ఇతర ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సాయాన్ని నిరోధించడంలో పాక్‌ విఫలమైందని పేర్కొంది. పాక్‌ తీసుకుంటున్న ఉగ్రవాద నిరోధక చర్యలు 40లో 31 ఎఫ్‌ఏటీఎఫ్‌ ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేల్చింది.  గత ఏడాదే ఎఫ్‌ఏటీఎఫ్‌ పాకిస్తాన్‌ను గ్రే లిస్ట్‌లో ఉంచింది. ఈ ఏడాది గ్రే లిస్ట్‌ నుంచి పాక్‌ను బ్లాక్‌ లిస్ట్‌కు మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎఫ్‌ఏటీఎఫ్‌ ప్లీనరీ సమావేశాలు పారిస్‌లో ఈ నెల 13 నుంచి జరగనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.