కిడ్నీవ్యాధుల నివారణకు ఎక్కువ శుభ్రమైన నీటిని సేవించాలి — డా. పెద్ది సందీప్

 

కరీంనగర్ జులై 20 pes మీడియా సర్వీసెస్ : ప్రముఖ నెఫ్రాలాజి వైద్యులు డాక్టర్ పెద్ది సందీప్ తో pes media services ఆన్ లైన్ మీడియా ప్రతినిధి జవ్వాజి అంజిబాబు ఇంటర్వ్యు….

ప్రశ్న : మీ విద్యాభ్యాసం గురించి చెప్పండి ?

జవాబు : ఇంటర్ వరకు పుట్టపర్తి సత్యసాయి విద్యాసంస్థల్లో ..MBBS  [2001-2007] శ్రీ దేవరాజ్ మెడికల్ కాలేజ్ తమక కొలర్ కర్ణాటక ..MD [జనరల్ మెడిసిన్  ][2008-2001] గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మైసూర్ కర్ణాటక ..DM [నెఫ్రాలాజి ] [2012-2015] శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యుట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుపతి లో విద్యాభ్యాసం జరిగింది .

ప్రశ్న: మీ కుటుంభం గురించి .. స్వస్థలం  ?

జవాబు : కరీంనగర్ పట్టణం చైతన్యపురి . తల్లి  పెద్ది కొటేశ్వరి తండ్రి పెద్ది విద్యాసాగర్ . నా సతీమణి డా. జిల్లా రజిత MBBS. MD [pathology] చేసారు. మాకు ఇద్దరు పిల్లలు .

ప్రశ్న : భవిష్యత్తులో ఎలాంటి సామాజిక సేవ కార్యక్రమాలు  చేయాలనుకుంటున్నారు ?

జవాబు : మా తాత గారైన పెద్ది శంకరయ్య పేరు మీద  మెమోరియల్ ట్రస్ట్ పెట్టి స్కూల్  పిల్లలకు కిడ్నీ వ్యాధుల పట్ల ఉచితంగా  అవగాహన కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నాను.

ప్రశ్న : ప్రస్తుతం మీరు ఎక్కడ మీ సేవలను అందిస్తున్నారు . ఏ  సమయం లో మీరు అందుభాటులో ఉంటారు ?

జవాబు : ప్రతిరోజు కరీంనగర్ లోని బొమ్మకల్ లో గల చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజ్ లో ఉదయం 9 గం . నుండి సాయంత్రం 4 గం .వరకు అదేవిధంగా కరీంనగర్ జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ  మాత శిశు హాస్పిటల్ ముందు గల సాగర్ హాస్పిటల్ లో సాయంత్రం 5 గం నుండి రాత్రి 8 గం వరకు అందుభాటులో ఉంటాను . నా సెల్ నెంబర్ 94904 48186 .

ప్రశ్న : మూత్ర పిండ మార్పిడి [ కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ ] గురించి వివరిస్తారా ?

జవాబు : ఈ చికిత్స విధానం క్రొనిక్ రినల్ ఫెయిల్యూర్ ఫెషేంట్ లకు జరుపబడును .దీని యందు దాత [ donor ] నుండి గ్రహింప బడిన మూత్రపిండం ను గ్రహీత [ recipient ] శరీరమున అమర్చబడును .దాత నుండి మూత్రపిండం ను గ్రహించుటకు ముందు రక్తం గ్రూప్ [ HLA typing , matching ] మరికొన్ని పరిక్షలు నిర్వహించవలసి ఉంటుంది .

ప్రశ్న : లైవ్ రిలేటెడ్ మూత్రపిండ మార్పిడి కేదావార్ మూత్రపిండ మార్పిడి అంటే ఏమిటి ?

జవాబు : రోగి యొక్క తల్లి తండ్రి అన్నదమ్ములు ,అక్కచెల్లెండ్లు ,పిల్లలు జన్యుపరమైన సన్నిహిత కారణాల వలన దాతలుగా పరిగణింపబడుతారు దీనిని లైవ్ రిలేటెడ్ మూత్రపిండ మార్పిడి అంటారు . కొన్ని పరిస్థితులలో ఎవరైన చనిపోయిన వ్యక్తి నుంచి మూత్రపిండాల మార్పిడి చేసే ప్రక్రియను కేడావర్ మూత్రపిండా మార్పిడి అంటారు .

ప్రశ్న : మూత్రపిండాల ప్రాముఖ్యత చెప్పండి ?

జవాబు : సాధారణముగా మానవ శరీరములో వెన్నెముకకు ఇరువైపుల రెండు మూత్రపిండము లుంటాయి . వాటి నుండి మూత్ర వాహికలు [ యురిటర్స్] అనే గొట్టాల ద్వారా మూత్రం పొత్తికడుపు క్రింది భాగం లో ఉండే మూత్ర కోశం [ యూరినరి భ్లాడర్ ] లోనికి చేరుకుంటుంది . తదుపరి మూత్రనాళం [ యురిత్రా ] ద్వారా బయటకు విసర్జింప బడుతుంది . మూత్రపిండం సుమారుగా నిమిషం నకు 1 మి.లీటర్ మూత్రం ను తయారు చేస్తాయి .

ప్రశ్న : మూత్రపిండం ల విధుల గురించి తెలపండి ?

జవాబు : రక్తాన్ని వడపోసి మలిన పదార్థాలను [ యూరియా క్రియాటినిన్ ] వేరు చేసి వాటిని మూత్రము ద్వారా విసర్జింప జేయటం . దేహం లో నీటి శాతాన్ని అవసరమైన పరిమాణం లో క్రమబద్దంగా ఉంచి ఎక్కువైన నీటిని మూత్రము గా విసర్జించడం .దేహం లో లవణ పరిమాణాన్ని కూడా క్రమికరించడం . కొన్ని హార్మోన్లు [ విటామిన్ -డి , ఎరితో పాయిటిస్ ] ఉద్బవం . ఈ హార్మోన్లు ఎముకలను గట్టిగా ఉంచుతాయి .రక్తం తయారీలో ఉపయోగపడుతాయి .

ప్రశ్న : మూత్రపిండములు చెడిపోవు టకు గల కారణాలు ?

జవాబు : మధుమేహ వ్యాధి ,రక్తపోటు ,గ్లామేరులోనే ప్రిటీస్ [ఉబ్బు కామెర్లు ] అధిక మొత్తం లో నొప్పుల మాత్రలు వాడటం ,మూత్రపిండం లో రాళ్ళు ,పాముకాటు ,మలేరియా,పచ్చ కామెర్లు ,గర్భము సమయం లో మూత్రం ఇన్పెక్షన్ , రక్తపోటు రావడం వంటి కారణముల వలన మూత్రపిండములు చెడిపోతాయి .

ప్రశ్న : మూత్రపిండమూలా వ్యాధులు రాకుండ నివారణ చర్యలు ఏమిటి ?

జవాబు : రోజుకు తగిన మోతాదులో నీటిని త్రాగాలి . రక్తపోటు [ బిపి ] మధుమేహం [షుగర్ ] వ్యాధులకు సరి అయిన చికిత్స చేయించుకోవాలి . మనం రోజు తినే ఆహరం నందు ఉప్పు తక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి .

ప్రశ్న : మధుమేహం [ షుగర్ ] వ్యాధి వలన మూత్రపిండ వ్యాధి వస్తుందా ?

జవాబు : షుగర్ వ్యాధిగ్రస్తులలో మూడు వంతుల మందికి మాత్రమె మూత్రపిండము లకు సంబంధించిన వ్యాధులు వస్తాయి . రక్తం నందు షుగర్ తగు మోతాదు కంటే ఎక్కువగా ఉండటం . అధిక రక్తపోటు , సిగరేట్, బీడి, చుట్టా , సారా వంటి వ్యసనాలకు లోను అయ్యేవారికి అలాగే కుటుంభంలో తరతరాల నుంచి షుగర్ వ్యాధి ఉన్నవారికి మూత్రపిండాలు తొందరగా చెడిపోయే అవకాశం ఉంటుంది .

ప్రశ్న : మూత్రపిండములు ఫెయిల్యూర్ [ కిడ్నీ ఫెయిల్యూర్ ] అంటే ఏమిటి ?

జవాబు : మూత్రపిండములు పనిచేయడం తగ్గడాన్ని కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు . ఇది రెండు రకాలు . మొదటిది ఎక్యుట్ కిడ్నీ ఫెయిల్యూర్ అనునది ఉన్నట్లుఉండి కనబడే జబ్బు .దీనిని ప్రథమ దశలో కనుగొని తగు జాగ్రత్తలు చికిత్స చేయించుకుంటే తొందరగా జబ్బు నయం అయ్యే అవకాశాలు ఉంటాయి . రెండవది క్రోనిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది దీర్గకాళిక కాలిక వ్యాధి .ఈ జబ్బును ప్రథమ దశలో కనుగొని సరి అయిన చికిత్స తీసికోవడం వలన జబ్బు పెరుగుదలను తగ్గించ వచ్చును .

ప్రశ్న : డయాలసిస్ అనగానేమి . వాటిలోని రకాల గురించి వివరించండి ?

జవాబు : డయాలసిస్ అనగా మూత్రపిండాలు పనిచేయనపుడు రోగి దేహం లో పేరుకు పోయిన మలిన పదార్థాలను తీసే ప్రక్రియను డయాలసిస్ అంటారు . ఇది రెండు రకములుగా చేయవచ్చును .హిమోడయాలసిస్ : శరీరమునందు కల రక్తమును సూదులు ,గొట్టముల ద్వారా బయటకు తీసి డయలైసర్ ద్వారా పంపి శుభ్రపరచుట . ఈ డయలైసర్  వడపోత కాగితము వలే పనిచేసి శరీరం నందు గల వ్యర్ధ పదార్థములను వేరు చేయును . జబ్బు యొక్క తీవ్రతను బట్టి ఈ ప్రక్రియ ను ప్రతి రోజు లేదా వారానికి రెండు మూడు సార్లు [ కొన్ని గంటలు ] చేయవలసిన అవసరం ఉంటుంది . పెరిటోనియల్ డయాలసిస్ : ఈ పద్దతిలో ఉదర కోశములోని పెరిటో నియల్  కుహరంలో [CAVITY] గొట్టాన్ని అమర్చి దాని ద్వారా పెరిటోనియల్ ఫ్లూయిడ్ ని పంపి దేహంలోని మలిన పదార్థాలను వేరుచేసి బయటకు తీసే విధానం . ఈ ప్రక్రియ ప్రతిరోజు రెండు మూడు సార్లు  [కొన్ని గంటలు ] చేయవచ్చును . ఈ విధానం లో పెరిటోనియల్ గొట్టం [ CATHETER ] ఉదర కోశము నందు అమర్చి దాని ద్వారా లోపలి సోల్ల్యుషన్ ను పంపి రక్తం లోని వ్యర్ధ పదార్థాలను తీసివేయబడును . కొన్ని పరిస్థితులలో రోగ తీవ్రతను బట్టి ఈ సోల్ల్యుషన్ మార్పిడి ప్రతి గంటకు చేయవలసిన అవసరం ఉంటుంది .

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.