తెలంగాణలో 15వేలు దాటిన కరోనా కేసులు

హైదరాబాద్ జూన్ 29 PESMS మీడియా సర్వీసెస్‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 975 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 15,394కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 5,582 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 9,559 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనాతో మరో 6 గురు మృతిచెందడంతో.. మొత్తం మృతుల సంఖ్య 253కి చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 861 ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.