పీవీ నరసింహారావుకు సీఎం కేసీఆర్‌ నివాళి

హైదరాబాద్  జూన్ 28 PESMS మీడియా సర్వీసెస్‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ఘనంగా నివాళి అర్పించారు. పీవీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆదివారం ఉదయం పీవీ జ్ఞానభూమి వద్ద ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పీవీ కుటుంబసభ్యులు, మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ రావు, పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఏడాదిపాటు నర్సింహారావు శత జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.