ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద ఉధృతి

విజయవాడ ఆగష్టు 13 PESMS  మీడియా సర్వీసెస్ : ప్రకాశం బ్యారేజ్‌కి భారీగా వదర నీరు చేరుతోంది. దీంతో పదేళ్ల తర్వాత బ్యారేజ్‌ పూర్తి స్థాయి జలకళను సంతరించుకుంది.  పశ్చిమ కనుమల్లో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో కృష్ణమ్మ ఉప్పొంగుతున్న సంగతి తెలిసిందే. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్‌, ఉజ్జయిని, తుంగభద్ర, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే బ్యారేజ్‌ 70 గేట్లను కొంత ఎత్తు పైకి లేపి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం కృష్ణా నదిలో ఐదు లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండటంతో.. మరికాసేపట్లో  ప్రాజెక్టు గేట్లను మరికొంత ఎత్తుకి లేపి.. నీటి విడుదలను పెంచనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.