ప్రాజెక్ట్ ల నాణ్యతల పై సిబిఐ విచారణ చేపట్టాలి – వివేక్ వెంకటస్వామి

కొదురుపాక [ సిరిసిల్లా ] అక్టోబర్ 07 PESMS  మీడియా సర్వీసెస్ : ప్రాజెక్ట్ ల నాణ్యత లోపాల పై సిబిఐ విచారణ చేపట్టాలని పెద్దపల్లి మాజీ ఎంపి , బిజెపి నేత గడ్డం వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు .  సిరిసిల్లా జిల్లా కొదురుపాక మిడ్ మానేర్ కట్ట కు సిఫేజ్ ఏర్పడిన ప్రాంతాన్ని సోమవారం వివేక్ సందర్శించారు . ఈ సందర్బంగా మాట్లాడుతూ…  మిడ్ మానేర్ కట్ట నిర్మాణంలో నాణ్యతాలోపం జరిగిందని స్పష్టంగా కనపడుతోందని అన్నారు . డుడు బస్మన్నలను వేనుకేసుకొని కెసిఆర్ తుగ్లక్ లా వ్యవహరిస్తున్నాడని హేద్దేవ చేశారు .  మిడ్ మానేర్ కట్ట ఇప్పుడున్న స్థితిగతులను చూసి నీటి పారుదల శాఖ నిపుణులు సైతం ముక్కు విరుస్తున్నారని అన్నారు . కల్వకుంట్ల ఫ్యామిలి ఏది చెబితే అదే నడుస్తుందని కెసిఆర్ పగటి కళలు కంటున్నాడని ధ్వజమెత్తారు . మిడ్ మానేర్ నిర్వాసితులకు నష్టం జరుగకుండ మిడ్ మానేర్ కట్ట పక్కన మరో కట్ట నిర్మించాల్సిందే నని తేల్చి చెప్పారు . వివేక్ వెంట కరీంనగర్ , సిరిసిల్ల జిల్లాల బిజెపి అధ్యక్షులు బాస  సత్యనారాయణ , ప్రతాప రామకృష్ణ ,మాన్వాడ సర్పంచ్ శ్రీనివాస్ , మిడ్ మానేర్ నిర్వాసితుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కుస రవి , ఎమ్సికే మాజీ మేయర్ డి శంకర్ తదితరులున్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.