మంత్రి పదవి కెసిఆర్ ఇచ్చిన బిక్షే — మంత్రి గంగుల

కరీంనగర్ టౌన్ సెప్టెంబర్ 10 PESMS  మీడియా సర్వీసెస్ : నాకు మంత్రి పదవి రావడం కెసిఆర్ బిక్షే.. కెసిఆర్ బొమ్మ పెట్టుకునే గెలిచానని బిసి సంక్షేమ ,పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ భావోద్వేగంగా అన్నారు . మంత్రి పదవి చేపట్టి మొదటిసారిగా కరీంనగర్ విచ్చేసిన గంగుల మంగళవారం మీడియాతో మాట్లాడారు . 19 మంది క్యాబినెట్ లో నాకు చోటు లభించడం అదృష్టంగా భావిస్తున్నానని వెల్లడించారు . కెసిఆర్ నాపై పెట్టిన ఆశలను వమ్ముచేయనని స్పష్టం చేశారు . ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాస్వామ్యబద్దంగా నడుచుకుంటానని పేర్కొన్నారు . రేపటినుండి స్మార్ట్ సిటీ పనులు     జరుగుతాయని ,కరీంనగర్ కు స్మార్ట్ర్ట్ సిటీ తెచ్చిన ఘనత కెసిఆర్కె దక్కుతుందన్నారు . మంత్రి పదవి భాద్యత నాపై  ఉన్నందున గతంలో మాదిరిగా కాకుండా కొంత మారాల్సి వస్తోందని తెలిపారు .  మికిచ్చిన శాఖల పరంగా ఎలాంటి అభివృద్ధి చేపడుతారని విలేకరి అడుగగా వాటిపై ఇంకా పూర్తిగా అవగాహన లేదని దాటవేశారు .  ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్పర్సన్ కనుమల్ల విజయ , చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ , మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్ , మైనార్టీ కార్పోరేషన్ చైర్మన్ అక్బర్ హుస్సేన్ , కుడా చైర్మన్ జివి రామకృష్ణారావు ,మాజీ డిప్యూటి మేయర్ గుగిళ్ళ రమేష్ ,  గ్రంధాలయ చైర్మన్ రవీందర్ రెడ్డి , మాజీ కార్పొరేటర్లు బండారి వేణు , వై సునీల్ రావు , బొనాల శ్రీకాంత్ , రమణ , తెరాస నాయకులు వాసాల రమేష్ , చిట్టిమల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు . అనంతరం పలువురు జాప్రతినిధులు , తెరాస శ్రేణులు , సంఘాల నాయకులు పుష్పగుచ్చాలను అందజేసి గంగులకు అభినందనలు తెలిపారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.