మత్య్సకారులకు వలలు లైఫ్ జాకెట్లు పంపిణీ — మంత్రి కొప్పుల

జగిత్యాల ఆగష్టు 13 PESMS  మీడియా సర్వీసెస్ : జగిత్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో మంగళవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ మత్స్య శాఖా ఆధ్వర్యంలో మత్య్సకారులకు మంజూరైన వలలు, లైఫ్ జాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ..  మత్య్సకారులను ఆదుకోవడం కోసం వలలు, మోపెడ్ , చేప విత్తనాల పంపిణీ చేస్తున్నాం అని అన్నారు.  ప్రభుత్వం అందజేసే సంక్షేమ కార్యక్రమాలను మత్స్యకారులు  సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంతో 20 రిజర్వాయర్ల ఏర్పాటు జరుగుతున్నాయి . దీంతో నీటి లభ్యత వల్ల కోట్లాది రూపాయల మత్స్య సంపద పెరిగే అవకాశం ఉందని.. గతంలో ఏ ప్రభుత్వం మత్స్యకారులను ఆదుకున్న దాఖలాలు లేవని ఆయన గుర్తు చేశారు.  మీ గురించి ఆలోచిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం – సీఎం కేసీఆర్ అని అన్నారు..  రానున్న. రోజుల్లో ఫిష్ హబ్ గా తెలంగాణ మారుతుందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.