మరోసారి నోరు పారేసుకున్న పాక్‌ మంత్రి

ఇస్లామాబాద్‌ సెప్టెంబర్ 10 PESMS  మీడియా సర్వీసెస్ : భారత క్రీడా అధికారులు అట్టడుగు స్థాయి వ్యక్తుల్లా ప్రవర్తిస్తున్నారంటూ పాకిస్తాన్‌ మంత్రి ఫవాద్‌ చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా శ్రీలంక క్రికెటర్లు పాకిస్తాన్‌ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. క్రికెటర్లతో చర్చించిన అనంతరం ప్రస్తుత పరిస్థితుల్లో తమ ఆటగాళ్లు పాక్‌లో పర్యటించకూడదని నిర్ణయించుకున్నట్లు శ్రీలంక బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ విషయంపై స్పందించిన పాక్‌ మంత్రి ఫవాద్‌ మరోసారి భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. ఈ మేరకు…‘ పాక్‌లో పర్యటిస్తే ఐపీఎల్‌ ఆడకుండా అడ్డుకుంటామని భారత్‌ శ్రీలంక ఆటగాళ్లను బెదిరించిందని కొంతమంది స్పోర్ట్స్‌ కామెంటేటర్లు నాకు చెప్పారు. ఇది నిజంగా చవకబారు చర్య. భారత క్రీడా అధికారుల మితిమీరిన దేశభక్తికి నిదర్శనమైన ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉంది. నిజంగా ఇది దిగజారుడు, చవకబారు పని’ అని ఫవాద్‌ ట్వీట్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.