
పెద్దపల్లి ఆగష్టు 13 PESMS మీడియా సర్వీసెస్ : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఈ వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అధికారులు, అతిథులు, ప్రజలు వేడుకలను వీక్షించేందుకు అవసరమైన షామియానాలను ఏర్పాటు చేస్తున్నారు. పోలీసు కవాతు, సాంస్కృతిక ప్రదర్శనల నిర్వహణకు సంబంధించి పరేడ్ గ్రౌండ్‌ను ముస్తాబు చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను పూర్తి చేసే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు.