9న మద్యం దుకాణాల టెండర్‌ నోటిఫికేషన్‌

హైదరాబాద్‌ అక్టోబర్ 08 PESMS  మీడియా సర్వీసెస్ : రాష్ట్రంలో మద్యం దుకాణాల నిర్వహణకు ఈ నెల 9న టెండర్‌ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూపొందించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం నవంబర్‌ 1న కొత్త మద్యం దుకాణాల నిర్వహణకు ఈ నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు. దీని ప్రకారం ఈ నెల 9 నుంచి 16 వరకు కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 13వ తేదీ ఆదివారం దరఖాస్తులు తీసుకోరు. జిల్లా ఆబ్కారీ శాఖ కార్యాల యాలతోపాటు హైదరాబాద్, నాంపల్లిలోని ఆబ్కారీ కార్యాలయంలోని రెండో ఫ్లోర్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 18న డ్రా ద్వారా షాపులు కేటాయించనున్నారు. ఈ నెల 30లోపు కొత్త మద్యం దుకాణాల యజమానులకు లైసెన్స్‌లు అందజేసి నవంబర్‌ 1 నుంచి కొత్త యాజమాన్యాల ఆధ్వర్యంలో మద్యం విక్రయిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.