వైఎస్సార్‌ సీపీలో చేరిన బీద మస్తాన్‌రావు

 తాడేపల్లి డిసెంబర్ 07 PESMS  మీడియా సర్వీసెస్ : నెల్లూరు జిల్లా టీడీపీ నేత, కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన శనివారం పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌, పార్టీ నేతలు పాల్గొన్నారు.

ఆర్టీసీని గట్టెకించేందుకే బస్సు చార్జీల పెంపు — పేర్ని నాని

అమరావతి డిసెంబర్ 07 PESMS  మీడియా సర్వీసెస్ : ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని శనివారం రోడ్లు, భవనాలశాఖ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశంలో వెల్లడించారు. పల్లె వెలుగు.. సిటీ సర్వీస్‌ బస్సులకు ప్రతి కిలోమీటర్‌కు రూ. 10 పైసలు, ఇతర సర్వీసులకు కిలోమీటర్‌కు రూ. 20 పైసల చొప్పున పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన Read More …

విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం

కృష్ణా డిసెంబర్ 06 PESMS  మీడియా సర్వీసెస్ : విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బీసెంట్ రోడ్డులోని ఆర్‌ 900బట్టల షోరూంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో షాపు పరిసర ప్రాంతాల్లో పోగ దట్టంగా వ్యాపించింది. బట్టల షోరూం కావడంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఇదే షోరూంకు పక్కన కూడా మరికొన్ని బట్టల షాపులు Read More …

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ సరైనదే — వాసిరెడ్డి పద్మ

అమరావతి డిసెంబర్ 06 PESMS  మీడియా సర్వీసెస్ : దిశ నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడం ద్వారా బాధితురాలి ఆత్మ శాంతిస్తుందని మహిళా కమిషన్‌ చైర్మన్‌ వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. దిశకు సత్వర న్యాయం జరిగిందంటూ దోషులకు పడిన శిక్షను స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక మీడియాతో ఆమె మాట్లాడుతూ.. ఈ ఎన్‌కౌంటర్‌తో వైఎస్సార్‌ హయాంలో జరిగిన సంఘటన మరొకసారి గుర్తుకు Read More …

కియా మోటర్స్‌ గ్రాండ్ ఓపెనింగ్‌లో సీఎం జగన్‌

అనంతపురం డిసెంబర్ 05 PESMS  మీడియా సర్వీసెస్ : జిల్లాలోని పెనుకొండలో గల కియా ఫ్యాక్టరీ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. గురువారం ఉదయం 11 గంటలకు కియా ఫ్యాక్టరీకి చేరుకున్న సీఎం.. ఈ సందర్భంగా కియా యాజమాన్యంతో సమావేశం అయ్యారు. పరిశ్రమ గురించి అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమలోని అన్ని విభాగాలను Read More …

సీఎం వైఎస్ జగన్‌ డిల్లీ పర్యటన

అమరావతి డిసెంబర్ 05 PESMS  మీడియా సర్వీసెస్ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. సాయంత్రం 4.30గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి విమానంలో బయలుదేరి సాయంత్రం 6.15కు ఢిల్లీకి చేరుకున్నారు. మరికాసేపట్లో వైఎస్సార్‌ ఎంపీలతో సీఎం జగన్‌ సమావేశం కానున్నారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు. రాత్రి ఢిల్లీలోనే బస చేసి శుక్రవారం ఉదయం ప్రధానమంత్రి Read More …

పవన్‌ మహిళలకు క్షమాపణలు చెప్పాలి — డిప్యూటీ సీఎం పుష్ప

అమరావతి డిసెంబర్ 04 PESMS  మీడియా సర్వీసెస్ :  రేపిస్టుల విషయమై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి డిమాండ్‌ చేశారు. షాద్‌నగర్‌ ఘటన కేసులో నిందితులను బహిరంగంగా ఉరి తీయాలంటూ జనం చేస్తున్న డిమాండ్‌ సరికాదని, రేపిస్టులను బెత్తంతో రెండు దెబ్బలు చెమ్డాలు ఊడేలా కొడితే సరిపోతుందంటూ పవన్‌ వ్యాఖ్యలు చేసిన Read More …

రెల్లి, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ల నియామకం

అమరావతి డిసెంబర్ 04 PESMS  మీడియా సర్వీసెస్ : రెల్లి, ఎస్సీల కార్పొరేషన్‌లకు చైర్మన్‌లను నియమిస్తున్నట్లు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మాల కార్పొరేషన్‌ చైర్మన్‌గా పెడపాటి అమ్మాజీ, మాదిగ కార్పొరేషన్‌ చైర్మన్‌గా కొమ్మూరి కనకరావు, రెల్లి కార్పొరేషన్‌ చైర్మన్‌గా వదయ్‌ మధుసూధన్‌రావులు నియమితులయ్యారు.

దిశ వంటి ఘటనలు పునరావృతం కాకుడదు — వాసిరెడ్డి పద్మ

విజయవాడ డిసెంబర్ 03 PESMS  మీడియా సర్వీసెస్ : దిశకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ కోరారు. దిశ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టాల దశను మార్చాలని అభిప్రాయపడ్డారు. విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్‌లో ‘ఉమెన్ సేఫ్టీ ఇన్ సైబర్ స్పేస్’ అనే అవగాహన కార్యక్రమంలో మహిళా మంత్రులు Read More …

ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

అమరావతి డిసెంబర్ 03 PESMS  మీడియా సర్వీసెస్ : ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. 2020 మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 8 వరకు టెన్త్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ షెడ్యూల్‌ ప్రకటించారు. ఉదయం 09.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు.