ఆర్టీసీ బస్సు ఢీ కొని వ్యక్తి మృతి

జగిత్యాల అక్టోబర్ 20 PESMS  మీడియా సర్వీసెస్  :  కరీంనగర్ రీజియన్ పరిధిలోని జగిత్యాల జిల్లా కోరుట్ల డిపోకు చెందిన బస్ నిజామాబాద్ కు వెళుతుండగా నిజామాబాద్ సమీపంలోని సుజిత్ ఫ్యాక్టరీ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఆదివారం జరిగిన  ఈ ఘటనలో ఒకరి మృతి చెందారు. బస్సును తాత్కాలిక డ్రైవర్ నడుపుతున్నాడు. తాత్కాలిక డ్రైవర్ ల వలన ప్రమాదాలు Read More …

కండక్టర్ ను ఢీకొట్టిన బస్సు… డ్రైవరు అరెస్టు

కరీంనగర్ టౌన్ అక్టోబర్ 14 PESMS  మీడియా సర్వీసెస్ : కరీంనగర్ బస్టాండులో ఆర్టీసీ కండక్టర్ ను బస్సు ఢీ కొట్టింది. దీంతో అతను గాయపడ్డాడు.  ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేయడంతో పోలీసులు బస్సు నడిపిన ప్రైవేటు డ్రైవరును అరెస్టు చేశారు. గాయపడిన కండక్టరును ఆస్పత్రికి తరలించారు. ప్రైవేట్ డ్రైవర్ల అలసత్వం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు Read More …

బైక్‌ను ఢీకొన్న లారీ… ఇద్దరి దుర్మరణం

మెట్‌పల్లి అక్టోబర్ 11 PESMS  మీడియా సర్వీసెస్ : మెట్‌పల్లి పట్టణంలోని బస్‌ డిపో వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. శుక్రవారం మల్లాపూర్‌ మండలం గుండంపల్లికి చెందిన గణశ్‌, లక్ష్మిలు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వేగంగా వచ్చిన లారీ వీరి పై నుంచి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు.

మహిళను కాపాడిన గోదావరి రివర్‌ పోలీసులు

కోల్‌సిటీ అక్టోబర్ 07 PESMS  మీడియా సర్వీసెస్ : గోదావరి రివర్‌ పోలీసులు మహిళను కాడాపారు. గోదావరినది బ్రిడ్జి పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడేందుకు యత్నించిన శివాజీనగర్‌కు చెందిన మాతంగి రాజేశ్వరిని గోదావరి రివర్‌ పోలీసు బృందం కాపాడారు.ఈ సందర్భంగా మహిళను గోదావరిఖని ఏసీపీ ఉమేందర్‌ వద్దకు తీసుకువెల్లి కౌన్సిలింగ్‌ నిర్వహించారు. మహిళను కాపాడిన రివర్‌ పోలీస్‌ కానిస్టేబుళ్లు Read More …

మాతాశిశు కేంద్రంలో డాక్టర్ల నిర్లక్ష్యంతో మహిళ మృతి

కరీంనగర్ అక్టోబర్ 02 PESMS  మీడియా సర్వీసెస్  : కరీంనగర్ పట్టణంలోని  మాతాశిశు కేంద్రంలో రమ అనే మహిళ మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే మహిళ మృతి చెందిందని మృతురాలి బందువులు ఆరోపించి ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. డాక్టర్ల నిర్లక్ష్యం పట్ల సర్వత్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి .

పంచాయతీరాజ్ ఏఈ సంధ్య ఆత్మహత్య

జగిత్యాల అక్టోబర్ 01 PESMS  మీడియా సర్వీసెస్ : జగిత్యాల జిల్లాలోని మేడిపల్లి మండలం వెంకట్రావుపేటలో విషాద సంఘటన చోటు చేసుకుంది. జగిత్యాల పంచాయతీరాజ్ ఈఈ కార్యాలయంలో ఏఈగా విధులు నిర్వహిస్తున్న సంధ్య ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. గ్రామస్తుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ Read More …

కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డికి జైలు శిక్ష

కరీంనగర్ సెప్టెంబర్ 27 PESMS  మీడియా సర్వీసెస్ : కరీంనగర్ పోలీస్ కమిషనర్ (సీపీ) కమలాసన్ రెడ్డికి జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించిన కేసులో కమలాసన్ రెడ్డి సహా ఏసీపీ తిరుపతి, కరీంనగర్ రూరల్ ఎస్ హెచ్ వో శశిధర్ రెడ్డికి శిక్ష విధించింది. ముగ్గురికి 6 నెలల జైలు శిక్ష, Read More …

పాము కాటుతో రైతు మృతి

జగిత్యాల సెప్టెంబర్ 24 PESMS  మీడియా సర్వీసెస్ : పాము కాటు కారణంగా ఓ రైతు చనిపోయాడు. జగిత్యాల మండలంలోని హబ్సీపూర్ గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. రాజయ్య అనే రైతును పాము కాటు వేయగానే కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను చనిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

ఉద్యోగం రావడం లేదని యువకుడి ఆత్మహత్య

మల్యాల సెప్టెంబర్ 23 PESMS  మీడియా సర్వీసెస్ : మల్యాల మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు ఉద్యోగం రావడం లేదని మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన నవీన్‌ అనే యువకుడు ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం పూర్వ విద్యార్థి. అప్పటి ఎంట్రన్స్‌లో నవీన్‌కు రాష్ట్రస్థాయిలో 8వ ర్యాంకు వచ్చింది. నవీన్‌ ఆత్మహత్యతో మల్యాలలో విషాదం నెలకొంది.

జే7 ఫోన్‌ పేరుతో మోసం

ధర్మపురి సెప్టెంబర్ 22 PESMS  మీడియా సర్వీసెస్ : వెల్గటూరు మండలం తాళ్లకొత్తపేట గ్రామంలో శనివారం మరో ఆన్‌లైన్‌ మోసం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన పొన్నం అనిల్‌కు ‘మీకు ఆన్‌లైన్‌లో జే 7 ఫోన్‌ ఆఫర్‌ వచ్చింది. రూ.1800 చెల్లించి ఫోన్‌ తీసుకోవాలని ఓ అమ్మాయి పదిరోజుల నుంచి ఫోన్‌చేసి విసిగిస్తోంది. అనుమానం వచ్చిన అతడు మొదట ఫోన్‌ Read More …