ఈ నెల 23 న శ్రీ సుందర సత్సంగ్ లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

కరీంనగర్ టౌన్ ఆగష్టు 21 PESMS  మీడియా సర్వీసెస్ : ఈ నెల 23 న కరీంనగర్ పట్టణం సాయినగర్ లోని శ్రీ సుందర సత్సంగ్ మురళీకృష్ణ మందిరంలో శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు నిర్వహించనున్నట్లు శ్రీ సుందర సత్సంగ్ ట్రస్ట్ అధ్యక్షులు దారం వినోద్ తెలిపారు . బుధవారం కరీంనగర్ ప్రెస్ భవన్ లో Read More …

ఆదివరాహస్వామి జయంతి వేడుకలు

కమాన్‌పూర్‌  ఆగష్టు 13 PESMS  మీడియా సర్వీసెస్ : జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కమాన్‌పూర్‌లోని శ్రీ ఆదివరాహస్వామి ఆలయంలో జయంతి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. రెండో రోజు మంగళవారం ఉత్సవాల సందర్భంగా జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధు, శైలజ దంపతులు గోపూజ, నిత్యహోమ ప్రారంభం, ఆదివరాహ యజ్ఞం తదితర పూజా కార్యక్రమాల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ జయంతోత్సవాల్లో Read More …

ఆలయాల్లో వరలక్ష్మి వ్రతాలు

పెద్దపల్లి ఆగష్టు 09 PESMS  మీడియా సర్వీసెస్ : శ్రావణ మాసంలో రెండోవారం వచ్చే వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా మహిళలు ఆలయాల్లో వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. వరలక్ష్మి శుక్రవారాన్ని పురస్కరించుకొని మహిళలు వ్రతం నిర్వహించి పసుపు కుంకుమలతో వాయినాలు ఇచ్చి పుచ్చుకొని తమ సౌభాగ్యాన్ని కాపాడాలని వేడుకున్నారు. దీంతో ఆలయాల్లో శ్రావణ మాస శోభ సంతరించుకుంది.

పంచముఖ హనుమాన్ దేవాలయంలో వరుణయాగం

కరీంనగర్ జూన్ 19 PESMS  మీడియా సర్వీసెస్ : కరీంనగర్ పట్టణంలోని  శ్రీ పంచముఖ హనుమాన్ దేవాలయంలో వర్షాలు కురవాలని  శత గట కలశ క్షీరాభిషేకం 108 కలశాలతో అభిషేకం నిర్వహించారు.  శ్రీ పరబ్రహ్మ ఆనందగిరి స్వాములవారి ఆద్వర్యంలో మంగళవారం వేద పండితుల మధ్య వరుణ యాగం యజ్ఞ పూజ నిర్వహించారు . అనంతరం ప్రసాద వితరణ Read More …

స్వరూపానందేద్రస్వామి ఆశీస్సులు పొందిన ఎంపీ, ఎమ్మెల్యే

హన్మకొండ జూన్ 12 PESMS  మీడియా సర్వీసెస్ : రాజ్యసభ సభ్యులు కెప్టెన్‌ లక్ష్మికాంతరావు, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్‌లు విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర మహాస్వామి వారి ఆశీస్సులను పొందారు. బుధవారం హన్మకొండ హంటర్‌ రోడ్‌లోని ఎంపీ, ఎమ్మెల్యే నివాసంలో స్వామి వారు దీవెనలు పొంది ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ Read More …

ఘనంగా హనుమాన్‌ శోభాయాత్ర

సుల్తానాబాద్ మే 27 PESMS  మీడియా సర్వీసెస్ : సుల్తానాబాద్ మండల కేంద్రంలోని పూసాలలో సోమవారం హనుమాన్‌ శోభాయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించారు. హనుమాన్‌ మాలదారులు ఉదయం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ పురవీధుల్లో శోభాయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేశామని, అలాగే సకాలంలో వర్షాలు Read More …

రాజన్నను దర్శించుకున్న ఎంపీ సంజయ్‌

వేములవాడ మే 24 PESMS  మీడియా సర్వీసెస్ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి వారిని కరీంనగర్‌ పార్లమెంట్‌ సభ్యులు బండి సంజయ్‌ దర్శించుకున్నారు. శుక్రవారం ఆయన స్వామి వారి సన్నిధిలో కోడె మొక్కు చెల్లించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంజయ్‌తోపాటు బీజేపీ నాయకులకు ఈఓ రాజేశ్వర్‌ స్వామి వారి ప్రసాదం, చిత్రపటాన్ని అందించి సత్కరించారు. Read More …

ఏసీబీ వలలో పెద్దమ్మగుడి ఈవో

బంజారాహిల్స్‌ మే 08 pesms మీడియా సర్వీసెస్ : జూబ్లీహిల్స్‌ శ్రీపెద్దమ్మ దేవాలయం ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న సైకం అంజనారెడ్డి అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. అర్చకుడి పదవిని పర్మనెంట్‌ చేస్తానంటూ రూ.లక్ష డిమాండ్‌ చేయగా మంగళవారం మధ్యాహ్నం సదరు అర్చకుడు అతడికి నగదు అందజేస్తుండగా అప్పటికే మాటు వేసిన ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి Read More …

వైభవంగా హనుమాన్‌ శోభాయాత్ర

హైదరాబాద్‌ ఏప్రిల్ 19 pesms మీడియా సర్వీసెస్ : హనుమాన్‌ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న శోభాయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. శుక్రవారం గౌలిగూడ రామ్‌మందిర్‌ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర ట్యాంక్బండ్‌ ఆంజనేయస్వామి దేవాలయం వరకు కొనసాగనుంది. ప్రస్తుతం శోభాయాత్ర ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు వరకు చేరుకుంది. శోభాయాత్రలో భజరంగ్‌ దళ్‌ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. Read More …

హనుమాన్‌ జయంతి వేడుకలు ప్రారంభం

పెద్దపల్లి ఏప్రిల్ 17 pesms మీడియా సర్వీసెస్ :  పెద్దపల్లి పట్టణంలోని హనుమాన్‌నగర్‌లో గల పుష్పగిరి పీఠం వారి శ్రీ రామభక్త అభయాంజనేయస్వామి ఆలయంలో హనుమాన్‌ జయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా శివాలయం నుంచి రామభక్త అభయాంజనేయస్వామి ఆలయం వరకు స్వామి వారి జెండాను హనుమాన్‌ మాలధారులచే మేళతాళాల మధ్య తీసుకువచ్చారు. Read More …