విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి — ఎస్ఎఫ్ఐ

కరీంనగర్  ఆగష్టు 19 PESMS  మీడియా సర్వీసెస్ : ఎస్ఎఫ్ఐ  కరీంనగర్ జిల్లా శాఖ ఆద్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ.. సమస్యలపై జిల్లా కలెక్టర్ చోరవ తీసుకుని సమస్యలకు పరిష్కరం  చూపాలని డిమాండ్ చేశారు.

ప్రతిమ మెడికల్ కాలేజ్ నర్సింగ్ విద్యార్థులకు అస్వస్థత

కరీంనగర్ రూరల్ ఆగష్టు 14 PESMS  మీడియా సర్వీసెస్ : కరీంనగర్ సమీపంలో గల  నగునూరు లోని ప్రతిమ మెడికల్ కాలేజ్ నర్సింగ్ విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారు . ఆలస్యంగా  వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన గురించి బయటికి పొక్కకుండ కాలేజ్ యాజమాన్యం జాగ్రత్తలు తీసుకున్నారు . దాదాపు 60 నుండి 80 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని సమాచారం . అస్వస్థతకు గురైన విద్యార్థులంత కేరళ Read More …

ప్రైవేట్ కళాశాలలో విద్యార్థిని చితకబాదిన లెక్చరర్

జగిత్యాల ఆగష్టు 11 PESMS  మీడియా సర్వీసెస్ : జగిత్యాలలో ఓ ప్రైవేట్ కళాశాలలో సిద్దిరాజ్ అనే లెక్చరర్ మనోజ్ అనే విద్యార్థిని తీవ్రంగా చితకబాదాడు. వీధి రౌడీ తరహాలో సిద్దిరాజ్ వేసిన వీరంగం సిసి కెమెరాల్లో రికార్డింది. ఆయన విద్యార్థిని పిడిగుద్దులు గుద్దాడు. కాళ్లతో తన్నాడు. లెక్చరర్ పై విద్యార్థి మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో Read More …

శాతవాహన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవాలు

కరీంనగర్ ఆగష్టు 08 PESMS  మీడియా సర్వీసెస్ :  కరీంనగర్ లో శాతవాహన విశ్వవిద్యాలయ  స్నాతకోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథి ప్రొఫెసర్ అగర్వాల్, ఇంచార్జి వి సి చిరంజీవులు బంగారు పతకాలు సాధించిన విద్యార్థులకు పట్టాలను అందజేశారు.

సర్కారు పాఠశాలల్లో మెరుగైన విద్య — డీఈఓ జగన్మోహన్‌రెడ్డి

కాల్వశ్రీరాంపూర్‌ ఆగష్టు 06 PESMS  మీడియా సర్వీసెస్  : సర్కారు పాఠశాలల్లోనే సుశిక్షితులైన ఉపాధ్యాయులచే మెరుగైన విద్య అందుతుందని డీఈఓ జగన్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫాం, టై బెల్ట్‌లు, షూలను అందించారు. అనంతరం మాట్లాడుతూ ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, దాతలు, ప్రజలు Read More …

రేపటి నుంచి ఇంజనీరింగ్‌ తరగతులు

హైదరాబాద్‌ జూలై 31 PESMS  మీడియా సర్వీసెస్ : ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభించేందుకు వర్సిటీలు కసరత్తు చేస్తున్నాయి.  ఇంజనీరింగ్‌ తొలిదశ ప్రవేశాల కౌన్సెలింగ్‌ ముగిసిపోగా, రెండో దశ సీట్ల కేటాయింపు సోమవారం పూర్తయింది. తొలిదశ కౌన్సెలింగ్‌లో కన్వీనర్‌ కోటాలో 69,544 సీట్లు అందుబాటులో ఉండగా, 49,012 మంది విద్యార్థులకు సీట్లు లభించాయి. Read More …

ఆగస్టు 8న శాతవాహన యూనివర్సిటీ స్నాతకోత్సవం

కరీంనగర్ జూలై 25 PESMS  మీడియా సర్వీసెస్ : కరీంనగర్ లోని శాతవాహన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం ఆగస్టు 8 వ తేదీ జరుగనుంది.  యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చిరంజీవి,  రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ గురువారం యూనివర్సిటీ ఛాన్సలర్ అయిన రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను కలిసి ఈ విషయం తెలియచేశారు. స్నాతకోత్సవానికి ఆయన్ని ఆహ్వానించారు.

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌ జూలై 14 PESMS  మీడియా సర్వీసెస్ : తెలంగాణ ఇంటర్మీడియట్  ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ ఆదివారం ఫలితాలను విడుదల చేశారు. గత మార్చిలో నిర్వహించిన రెగ్యులర్‌ పరీక్షల ఫలితాల్లో దొర్లిన సాంకేతిక తప్పులు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన తెలిపారు. మొదటి సంవత్సరం ఫలితాలను Read More …

సుల్తానాబాద్‌ అల్ఫోర్స్‌లో అలరించిన బోనాల వేడుకలు

సుల్తానాబాద్ జూలై 06 PESMS  మీడియా సర్వీసెస్  : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతిరూపంగా బోనాల వేడుకలు నిలుస్తాయని అల్ఫోర్స్‌ విద్యా సంస్థల అధినేత వి. నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం సుల్తానాబాద్ మండల కేంద్రంలోని అల్ఫోర్స్‌ హైస్కూల్‌లో బోనాల వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో బోనాల పండుగను వేడుకలా జరుపుకుంటారని, ఇందులో Read More …

పాఠశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపు

కరీంనగర్ జూన్ 27 PESMS  మీడియా సర్వీసెస్ :  ఏబీవీపీ ఈనెల 28న పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చింది. గురువారం నగరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నగర కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని, విద్యాహక్కుల చట్టం తేవాలని, పాఠశాలల్లో తల్లిదండ్రుల కమిటీలు వేయాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త బంద్‌కు సహకరించి Read More …