104 సంచార వైద్య సేవలు

పెద్దపల్లి ఆగష్టు 19 PESMS  మీడియా సర్వీసెస్ : మండలంలోని గౌరెడ్డిపేట , ముత్తారం గ్రామాల్లో 104 సంచార వైద్య సేవలు అందించారు. సోమవారం ఆయా గ్రామాల్లోని ప్రజలకు బీపీ, షుగర్‌, ఫిట్స్‌, ఆస్తమాలాంటి దీర్ఘకాలిక వ్యాధులతోపాటు పిల్లలు, గర్భిణులకు రక్త, మూత్ర పరీక్షలు నిర్వహించారు. అవసరం ఉన్న వారికి మందులు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో ల్యాబ్‌ టెక్నిషియన్‌ Read More …

సీజనల్‌ వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి

ముత్తారం  జూన్ 28 PESMS  మీడియా సర్వీసెస్ : వర్షాకాలంలో ప్రబలే సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని తహాసీల్దార్‌ రాజమణి అన్నారు. శుక్రవారం స్వచ్చ్‌ శుక్రవారంలో భాగంగా మండలంలోని ఓడేడ్‌ గ్రామంలో గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బందితో కలిసి రోడ్లకు ఇరువైపుల గల పిచ్చి మొక్కలను తొలగించి రోడ్లను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా Read More …

స్తంభించిన వైద్య సేవలు

హైదరాబాద్‌ జూన్ 18 PESMS  మీడియా సర్వీసెస్ : నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో వైద్యసేవలు స్తంభించాయి. కోల్‌కతాలో వైద్యులపై దాడిని ఖండిస్తూ సోమవారం దేశవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలో భాగంగా వైద్యులు నిరసన వ్యక్తం చేశారు. అత్యవసర సేవలు మినహాయించి మిగతా అన్నిరకాల వైద్యసేవలను నిలిపివేశారు. వివిధ విభాగాలకు చెందిన సీనియర్‌ వైద్యనిపుణులు, ప్రొఫెసర్‌లు, అసోసియేట్‌ Read More …

ప్రైవేటు ఆస్పత్రుల బంద్‌

కరీంనగర్‌ జూన్ 17 PESMS  మీడియా సర్వీసెస్ :  దేశ వ్యాప్త పిలుపు మేరకు ఐఎంఏ ఆధ్వర్యంలో నగరంలోని పలు ప్రైవేటు ఆస్పత్రులు బంద్‌ పాటించాయి. డాక్టర్లు, ఆస్పత్రులపై దాడులను నిరసిస్తూ చేపట్టిన బంద్‌లో భాగంగా నగరంలోని ఆస్పత్రులు బంద్‌ పాటించడంతో బోసిపోయాయి. వైద్యులు నిరసన ప్రదర్శనలు చేపట్టి దాడులను ఖండించారు.

మలేరియా దినోత్సవ ర్యాలీ

పెద్దపల్లి  ఏప్రిల్ 25 pesms మీడియా సర్వీసెస్ :  ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓదెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. గురువారం నిర్వహించిన కార్యక్రమంలో మలేరియా నివారణపై అవగాహన కల్పించారు. వ్యాధి లక్షణాలు వివరించడంతోపాటు నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈకార్యక్రమంలో డాక్టర్‌ నీతారెడ్డి, ఎంఓ రవీంద్రకుమార్‌, సీహెచ్‌ఓ ఆంజనేయులు, హెచ్‌వీ Read More …

కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కు అస్వస్థత

కరీంనగర్‌ ఏప్రిల్ 09 pesms మీడియా సర్వీసెస్ : లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప పాదయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. టవర్‌ సర్కిల్‌లో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో కరీంనగర్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ అస్వస్థతకు గురయ్యారు. ఆయన స్పృహ కోల్పోవడంతో ఆందోళన చెందిన అభిమానులు, కార్యకర్తలు వెంటనే అంబులెన్సులో సమీప ఆస్పత్రికి Read More …

వైద్యుల నిర్లక్ష్యం… రోడ్డుపై మహిళ ప్రసవం

హైదరాబాద్‌ ఏప్రిల్ 06 pesms మీడియా సర్వీసెస్ : వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ గర్భిణీ రోడ్డుపై ప్రసవించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ సంఘటన శనివారం ఎల్‌బీనగర్‌లో చోటుచేసుకుంది. హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని తారామతి పేటకు చెందిన మేరమ్మ అనే మహిళను కాన్పు నిమిత్తం వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి బంధువులు తీసుకువచ్చారు. పండుగ కావడంతో ఏరియా ఆసుపత్రిలో వైద్యులు Read More …

ప్రతి చిన్నారికి పల్స్ పోలియో చుక్కలు వేయించాలి

గోపాలరావుపేట్ [రామడుగు] మార్చి 10 pesms మీడియా సర్వీసెస్ : ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించి దేశం నుండి పోలియో మహమ్మారిని తరిమికొట్టాలని జాతీయ యువజన అవార్డు గ్రహీత అలవాల విష్ణు పిలుపునిచ్చారు . చిన్నారుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని, దేశవ్యాప్తంగా 0-5 సంవత్సరాల పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆయన  తెలిపారు  పల్స్ Read More …

పెద్దపల్లి లో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం

పెద్దపల్లి మార్చి 10 pesms మీడియా సర్వీసెస్ : పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం  పెద్దపల్లి జిల్లాలో కొనసాగింది . ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో పాఠశాలలు, ప్రయాణ ప్రాంగణం లతోపాటు, పలు ప్రాంతాల్లో చుక్కల మందులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు . ఐదు సంవత్సరాల లోపు చిన్నారుల తల్లిదండ్రులు వారి పిల్లలకు పోలియో చుక్కలు వేయించేందుకు ఆసక్తి Read More …

నులి పురుగుల నివారణ మాత్రల పంపిణీ

పెద్దపల్లి ఫిబ్రవరి 19 pesms మీడియా సర్వీసెస్ : పెద్దపల్లి మండలంలోని బ్రాహ్మహణపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో నులిపురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేశారు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవంలో భాగంగా మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు ఉపాధ్యాయులు మాత్రలు వేశారు.