85 లక్షలకు అమ్ముడుపోయిన అరటిపండు పెయింటింగ్

ఇటలీ డిసెంబర్ 07 PESMS  మీడియా సర్వీసెస్ : చిత్రంలో కనిపిస్తున్న ‘గోడకు అంటించిన నిజమైన అరటిపండు’ ఇటలీలోని మియామి బీచ్‌ ఆర్ట్‌ గ్యాలరీలో ఏకంగా రూ. 85 లక్షలకు అమ్ముడైంది. ‘కమెడియన్‌’గా పేరొందిన మౌరిజియో కాటెలాన్‌ అనే కళాకారుడు ఈ ఆర్ట్‌ను రూపొందించారు

భారత ఐటీ నిపుణులకు గుడ్‌న్యూస్‌

వాషింగ్టన్‌ డిసెంబర్ 07 PESMS  మీడియా సర్వీసెస్ : హెచ్‌1బీ వీసాలకోసం ఎదురుచూస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు గుడ్‌ న్యూస్‌.  హెచ్-1 బీ వీసాలకు సంబంధించిన దరఖాస్తులను 2020 ఏప్రిల్ 1నుంచి స్వీకరించనున్నట్లు  అమెరికా జాతీయ ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ ప్రకటించింది.  2021 సంవత్సరానికి గాను హెచ్‌1 బీ (నాన్-ఇమ్మిగ్రెంట్) వీసాలు జారీకి అవసరమైన ఎలక్ట్రానిక్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేసినట్లు అమెరికా సిటిజన్‌ షిప్‌ Read More …

ఒబామా కొన్న అద్భుత ప్యాలెస్‌

న్యూఢిల్లీ డిసెంబర్ 06 PESMS  మీడియా సర్వీసెస్ : చుట్టూ ఆవహించిన సముద్ర తరంగాల మీదుగా చల్లటి గాలులు వీస్తుంటే అందమైన దీవిపై వెలిసిన సువిశాల సుందర భవనంలో శాశ్వత నివాసం ఏర్పరుచుకొని, శేష జీవితం గడపాలనుకుంటే అది అందరికి స్వప్నం అవుతుందేమోగానీ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా దంపతులకు మాత్రం సాకారమవుతుంది. అమెరికాలోని మసాచుసెట్స్‌ రాష్ట్రంలోని Read More …

వాయుసేన చీఫ్‌కు తప్పిన ముప్పు

హోనోలులు డిసెంబర్ 06 PESMS  మీడియా సర్వీసెస్ : అమెరికా పర్యటనలో ఉన్న భారత్‌ ఎయిర్‌చీఫ్‌ మార్షల్‌ రాకేష్‌ భదౌరియాకు ముప్పు తప్పింది. హవాయి దీవుల్లోని పెరల్‌ హార్బర్‌లో బుధవారం ఇండో ఫసిఫిక్‌ ప్రాంతంలో భద్రతపై వివిధ దేశాల వైమానిక దళ మార్షల్స్‌ సదస్సులో ఆయన పాల్గొన్నారు. అదే సమయంలో ఒక నావికుడు పెరల్‌ హార్బర్‌లోకి చొరబడి కాల్పులు Read More …

అమెరికా తరపునే మాట్లాడా — డొనాల్డ్‌ ట్రంప్‌

న్యూయార్క్‌ డిసెంబర్ 05 PESMS  మీడియా సర్వీసెస్ : అభిశంసన విచారణ ప్రక్రియ సాగుతున్న క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విపక్షాల తీరును తప్పుపట్టారు. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం అధ్యక్ష పీఠాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ట్రంప్‌ ఎదురుదాడి ముమ్మరం చేశారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడుకి తాను ఫోన్‌ చేసిన క్రమంలో తమ దేశం గురించి Read More …

సముద్రం అడుగున తొలి హోటల్‌

న్యూఢిల్లీ డిసెంబర్ 05 PESMS  మీడియా సర్వీసెస్ : పచ్చని చెట్లను కడుపులో పొదుపుకొని కనువిందు చేసే పర్వత పక్తుల మధ్య నుంచి నీటిపై పడవలో ప్రయాణం చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించడం ఎవరికైనా ఇష్టమే. మరి నీటి అడుగున ఇంద్ర ధనుస్సులా సప్త వర్ణాల్లో మెరిసిపోయే పగడపు దీవుల అందాలను తిలకిస్తే, చుట్టూ తిరిగే పలు రంగుల రకాల Read More …

చిన్నారి ఇంటికి వచ్చి సర్‌ప్రైజ్‌ చేసిన యువరాజు

అబుదాబి డిసెంబర్ 04 PESMS  మీడియా సర్వీసెస్ : అబుదాబి యువరాజు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ కొద్దిరోజుల క్రితం ఓ విందులో పాల్గొన్నారు. ఈ విషయం తెలిసిన స్థానిక ప్రజలు అతని షేక్‌హ్యాండ్‌ కోసం బారులు తీరారు. ఇంతలో ఓ చిన్నారి పరుగు పరుగున వచ్చి ఆ లైన్‌లో నిలబడింది. అతని కోసం చేతులు ముందుకు చాచి ఆతృతగా ఎదురు చూడసాగింది. అందరికీ చిరునవ్వుతో కరచాలనం చేస్తూ వచ్చిన Read More …

ముంబై బీచ్‌లో చెత్త ఏరిన రాజదంపతులు

ముంబై డిసెంబర్ 04 PESMS  మీడియా సర్వీసెస్ : స్వీడన్ రాజదంపతులు కింగ్ కార్ల్-16 గుస్టాఫ్, క్వీన్ సిల్వియా ఐదు రోజుల భారత పర్యటనలో భాగంగా దేశంలోని పలు ప్రాంతాలను సందర్శిస్తున్న సంగతి తెలిసిందే. భారత పర్యటనలో రాజదంపతులు ప్రదర్శిస్తున్న నిరాడంబరత పలువురుని ఆకట్టుకుంటుంది. తాజాగా బుధవారం రాజదంపతులు ముంబై వెర్సోవా బీచ్‌లోని చెత్తను ఏరారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించడంలో Read More …

భారత జలాల్లోకి చైనా నౌక.. వెనుకకు పంపించిన నేవీ

న్యూఢిల్లీ డిసెంబర్ 03 PESMS  మీడియా సర్వీసెస్ : భారత సముద్ర జలాల్లో పోర్ట్ బ్లెయిర్ సమీపంలో గుట్టుచప్పుడు కాకుండా చైనా నౌక ఏవో అనుమానాస్పద అన్వేషణలు సాగిస్తోంది. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్‌లోని పోర్ట్ బ్లెయిర్ సమీపంలో చైనా నౌకను గుర్తించిన భారత నేవి అధికారులు వెంటనే తిరిగి వెళ్లిపోవాలని హెచ్చరించడంతో అక్కడి నుంచి చైనా నౌక Read More …

వ్యసనంగా మారుతున్న స్మార్ట్‌ఫోన్‌

లండన్‌ డిసెంబర్ 03 PESMS  మీడియా సర్వీసెస్ : ప్రపంచంలో ప్రతి నలుగురు యువతీయువకుల్లో ఒక్కరు స్మార్ట్‌ఫోన్‌ వ్యసనానికి అలవాటు పడ్డారని లండన్‌లోని కింగ్స్‌ కాలేజీ శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనం స్పష్టం చేస్తోంది. స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో లేకపోతే వీరు ఆందోళనకు గురవుతున్నారని, నిరుత్సాహానికి గురవుతున్నారని వీరు అంటున్నారు. స్మార్ట్‌ఫోన్లు విస్తృత వ్యాప్తిలోకి వచ్చిన 2011 సంవత్సరం నుంచి Read More …