యూఎస్‌ లాంటి పరిస్థితి తీసుకురావద్దు — హైకోర్టు

హైదరాబాద్ మే 26 PESMS మీడియా సర్వీసెస్‌‌‌‌ ‌ : ప్రాణాంతక కరోనా వైరస్‌ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జనాభాకు సరిపడ పరీక్షలు చేయకుండా వైరస్‌ వ్యాప్తికి ప్రభుత్వమే కారణమవుతోందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు చేయడంలేదని, వైద్యులకు మాస్క్‌లు ఇవ్వటం లేదని, రాష్ట్రానికి తిరిగి వస్తున్న వలస Read More …

ఏడాది పాటు బదిలీలు, ప్రమోషన్లు నిలిపివేత — తెలంగాణ హైకోర్టు 

హైదరాబాద్ మే 05 PESMS మీడియా సర్వీసెస్‌ ‌‌ : రాష్ట్రంలో కరోనా వైరస్‌ ఉధృతిని దృష్టిలో ఉంచుకొని మంగళవారం తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాది పాటు న్యాయమూర్తుల బదిలీలు, ప్రమోషన్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ప్రమోషన్లతో కూడిన న్యాయమూర్తుల వార్షిక బదిలీలను కూడా నిలిలివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వ్యక్తిగత, అత్యవసర దరఖాస్తులను పరిశీలిస్తామని హైకోర్టు పేర్కొంది. కాగా, లాక్‌డౌన్‌ Read More …

వృద్ధాశ్రమాలకు నిత్యావరస సరుకుల పంపిణీ — జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి

కరీంనగర్ టౌన్ ఏప్రిల్ 02 PESMS మీడియా సర్వీసెస్ : కరోనా నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితులలో పట్టణంలోని రెండు వృద్దశ్రమాలతో పాటు అనాథ బాలల ట్రస్టుపై కరీంనగర్ జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి దృష్టిసారించారు. దీనిలో భాగంగా బైపాస్ రోడ్డులోని వీర బ్రహ్మేద్ర వృద్ధాశ్రమంలో 36 మంది వృద్దులకు స్థానిక వివేకానంద హై స్కూల్ వారి సహకారంతో Read More …

ఏప్రిల్‌ 14 వరకు న్యాయవ్యవస్థ లాక్‌డౌన్‌

హైదరాబాద్‌ మార్చి 27 PESMS మీడియా సర్వీసెస్ : తెలంగాణలో న్యాయవ్యవస్థ లాక్‌డౌన్‌ను ఏప్రిల్‌ 14 వరకు పొడిగిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో హైకోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కోర్టులన్నీ ఏప్రిల్‌ 14 లేదా తదుపరి ఉత్తర్వులిచ్చే వరకూ లాక్‌డౌన్‌లో ఉంటాయని Read More …

సబ్‌ ఇంజనీరింగ్‌ పోస్టుల భర్తీకి లైన్‌ క్లియర్‌

హైదరాబాద్‌ మార్చి 12 PESMS మీడియా సర్వీసెస్ : ఏళ్ల తరబడి ఎదురుచూపులకు మోక్షం లభించింది. సబ్‌ ఇంజనీరింగ్‌ పోస్టుల భర్తీకి హైకోర్టు గురువారం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ట్రాన్స్‌కోలో 380 మంది సబ్‌ ఇంజనీర్‌ పోస్టులకు అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక తెలంగాణ అనంతరం 2015లో ఆ ఉత్తర్వులను రద్దు Read More …

మున్సిపల్ ఎన్నికలపై విచారణ రేపటికి వాయిదా

హైదరాబాద్ జనవరి 06 PESMS  మీడియా సర్వీసెస్  : తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌కు సంబంధించి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఎన్నికల నోటిఫికేషన్‌లో నిబంధనలు పాటించడం లేదని దాఖలైన పిటిషన్‌పై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది. ఎన్నికల నియమావళిని తమ ముందుంచాలని ఈసీని ఆదేశించింది.  ఈ సందర్భంగా ఎన్నికల మాన్యువల్‌ అందుబాటులో Read More …

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి — జిల్లా సివిల్‌ జడ్జి మంజుల

ఎల్లారెడ్డిపేట జనవరి 04 PESMS  మీడియా సర్వీసెస్ : చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా సివిల్‌ జడ్జి మంజుల పేర్కొన్నారు. శనివారం మండలంలోని వెంకటాపూర్‌ గ్రామంలో న్యాయవిజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యాయ వ్యవస్థలో ఉన్న సెక్షన్లపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ సీనియర్‌ సిటిజన్‌ హక్కులను తెలిపారు. అలాగే Read More …

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు

హైదరాబాద్‌ డిసెంబర్ 06 PESMS  మీడియా సర్వీసెస్ : దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ ఘటనపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఆరిఫ్‌, నవీన్‌, చెన్నకేశవులు, శివల మృతదేహాలను ఈ నెల 9 వరకు మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలోని భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది. శవపరీక్ష వీడియోను జిల్లా జడ్జికు అందజేయాలని హైకోర్టు స్పష్టం చేసింది.  ఎన్‌కౌంటర్‌పై హౌస్‌ Read More …

30న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కరీంనగర్ కు రాక

కరీంనగర్ లీగల్  నవంబర్ 28 PESMS  మీడియా సర్వీసెస్ :  తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర ఎస్ చౌహన్ శనివారం కరీంనగర్ కి విచ్చేస్తున్నట్లు ప్రిన్సిపాల్ జిల్లా సెషన్స్ జడ్జి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అధికారిక పర్యటనలో భాగంగా జిల్లా కోర్టు ఆవరణలో పి.ఓ.ఎస్.ఓ. కోర్టు , ఫ్యామిలీ కోర్టు గార్డెన్ తదితర Read More …

లైంగిక దాడి కేసులో నిందితుడికి జీవిత ఖైదు

వేములవాడ నవంబర్ 27 PESMS  మీడియా సర్వీసెస్  :   లైంగిక దాడి కేసులో నిందితుడికి కోర్టు జీవిత ఖైదు విధించింది. కూతురు వరుస అయిన మహిళను బెదిరించి లైంగికదాడికి పాల్పడిన కేసులో నిందితుడు సగరం రాజు (43)కు జీవిత ఖైదుతో పాటు రూ. 50 వేల జరిమానా విధిస్తూ ప్రత్యేక మహిళా న్యాయస్థానం న్యాయమూర్తి, జిల్లా జడ్జి Read More …

చెన్నమనేని పౌరసత్వం… 4 వారాలు పౌరసత్వ రద్దు ఉత్తర్వులు

వేములవాడ [ సిరిసిల్లా ] నవంబర్ 22 PESMS  మీడియా సర్వీసెస్ :  వేములవాడ టి ఆర్ ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు పౌరసత్వం రద్దు కేసులో హైకోర్టులో ఊరట లభించింది. కేంద్ర హోం శాఖ జారీ చేసిన ఉత్తర్వులను నాలుగు వారాల పాటు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.. కాగా,  చెన్నమనేని రమేశ్ Read More …

ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు భారత పౌరసత్వం రద్దు

వేములవాడ [ సిరిసిల్ల ] నవంబర్ 20 PESMS  మీడియా సర్వీసెస్ :  వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు భారత పౌరసత్వానికి అనర్హుడు అంటూ కేంద్ర హోంశాఖ ప్రకటించింది. మోసపూరితంగా భారత పౌరసత్వం పొందారని హోం శాఖ నిర్ధారించింది. దీంతో చెన్నమనేని పౌరసత్వం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, చెన్నమనేని రమేష్ ద్వంద్వ పౌరసత్వం కలిగి Read More …

ఆర్టీసీ అఫిడవిట్‌ పై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్‌ నవంబర్ 01 PESMS  మీడియా సర్వీసెస్ : ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. ఆర్టీసీకి ఇవ్వాల్సిన బకాయిలపై కోర్టు ప్రభుత్వ వివరణ కోరింది. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ సునిల్‌ శర్మ,  ఆర్థిక సలహాదారుడు రమేష్‌ ఆర్టీసీ ఆర్థిక స్థితిగతులపై  హైకోర్టులో ఆఫిడవిట్‌ దాఖలు చేశారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం నుంచి రాయితీల Read More …

హుజూరాబాద్ కోర్టు జడ్జి ప్రదీప్ నాయక్ సస్పెన్షన్

కరీంనగర్ అక్టోబర్ 31 PESMS  మీడియా సర్వీసెస్ : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి ప్రదీప్ నాయక్ ను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రదీప్ నాయక్ బాధ్యతలను కరీంనగర్ అదనపు సీనియర్ సివిల్ జడ్జి సతీష్ కుమార్ కు అప్పగించారు. గతంలో ప్రదీప్ నాయక్ Read More …

తెలంగాణ ఐఏఎస్‌లపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

హైదరాబాద్‌ అక్టోబర్ 24 PESMS  మీడియా సర్వీసెస్ : రాష్ట్రంలో డెంగీ వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో హైకోర్టు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డెంగీ గురించి వివరణ ఇచ్చే క్రమంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేందర్‌ కుమార్‌ జోషి సహా మున్సిపల్‌ శాఖ కార్యదర్శి గురువారం న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. ఈ క్రమంలో వారి వివరణపై కోర్టు Read More …

నలుగురు డీఈవోలకు జైలు శిక్ష

హైదరాబాద్ సెప్టెంబర్ 05 PESMS  మీడియా సర్వీసెస్ : తెలంగాణ హైకోర్టు నలుగురు జిల్లా విద్యా శాఖాధికారులకు జైలు శిక్ష విధించింది. 1998 డీఎస్సీ అభ్యర్థుల ఎంపిక కేసులో కోర్టు ధిక్కరణకు సంబంధించి నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో అప్పట్లో పనిచేసిన డీఈవోలకు శిక్ష పడింది. వీరికి రెండు నెలల జైలు శిక్ష, రెండు వేల రూపాయల Read More …

ఆరు మున్సిపాలిటీలలో అభ్యంతరాలు

హైదరాబాదు ఆగష్టు 16 PESMS  మీడియా సర్వీసెస్ :  తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పిటిషన్ పై హైకోర్టు లో విచారణ జరిగింది. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఆర్డినెన్స్- 6 ను అడిషనల్ అడ్వొకేట్ జనరల్ కోర్టుకు సమర్పించారు. పాత ఆర్డినెన్స్ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తారా..కొత్త ఆర్డినెన్స్ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తారా అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించగా పాత Read More …

చట్టం వేరు.. ప్రభుత్వ విధాన నిర్ణయాలు వేరు — సుప్రీంకోర్టు

హైదరాబాద్‌ ఆగష్టు 11 PESMS  మీడియా సర్వీసెస్ : నిజమైన ప్రజాస్వామ్యం అంటే న్యాయపరమైన సంయమనం, రాజకీయ స్వేచ్ఛ, చట్టబద్ధపాలన ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ అన్నారు. ఈ విధంగా జరిగినప్పుడే ప్రజాతంత్ర వ్యవస్థ నిజమైన మనుగడ సాధ్యం అవుతుందని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టబద్ధతకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. హైదరాబాద్‌లోని సర్దార్‌ Read More …

బార్ యాజమాన్యంకు జిల్లా ఫోరం మెట్టికాయ

కరీంనగర్ లీగల్ జూలై 22 PESMS  మీడియా సర్వీసెస్ : అక్రమంగా పన్నులు వసూలు చేశారని కరీంనగర్ పట్టణంలోని బార్ అండ్ రెస్టారెంట్ కు వ్యతిరేకంగా జిల్లా వినియోగదారుల ఫోరం అద్యక్షురాలు కె స్వరూపరాణి, సభ్యులు ప్రవీణ్ కుమార్ తీర్పుచెప్పారు . ఫిర్యాదుదారుని కథనం మేరకు …. సప్తగిరి కాలానికి చెందిన గంగం రాజు 02-06-2015 Read More …

భవనాల కూల్చివేత విచారణ వాయిదా

హైదరాబాద్‌ జూలై 17 PESMS  మీడియా సర్వీసెస్ : తెలంగాణ హైకోర్టు బుధవారం పలు కేసులను విచారించింది. ఈ సందర్భంగా మల్లన్నసాగర్‌ భూ వివాదం, మిర్యాలగూడ ఎన్నికలపై స్టే విధించగా సచివాలయం, ఎర్రమంజిల్‌ భవనం కూల్చివేతపై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. విచారణలో భాగంగా.. సచివాలయం, ఎర్రమంజిల్‌లో పురాతన భవనం కూల్చివేతల పిటిషన్‌పై ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ రామచంద్రరావు తమ వాదనలను వినిపించారు. Read More …