‘పేరం’ గ్రూపు సంస్థల్లో ఏకకాలం గా ఐటీ సోదాలు

అమరావతి అక్టోబర్ 31 pesms మీడియా సర్వీసెస్ : స్వల్ప కాలంలో భారీ రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లను ప్రారంభించిన పేరం గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ కార్యాలయాలపై మంగళవారం ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. ఏకకాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లోని ఆ కంపెనీ కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది. గత రెండేళ్ల నుంచి ఈ కంపెనీ భారీగా Read More …

ప్రాధాన్యం లేదన్నట్టుగా వ్యవహరించండి — సీఎం చంద్రబాబు

అమరావతి అక్టోబర్ 31 pesms మీడియా సర్వీసెస్ : ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి మీద జరిగిన హత్యాయత్నంపై అదేపనిగా మాట్లాడవద్దంటూ సీఎం చంద్రబాబునాయుడు తమ పార్టీ నేతలకు సూచించారు. కడప పర్యటనకు బయల్దేరకముందు ఆయన మంగళవారం ఉండవల్లిలోని తన నివాసంలో అందుబాటులో ఉన్న మంత్రులు, పార్టీ నాయకులతో మాట్లాడారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. జగన్‌ మీద హత్యాయత్నం ఘటనపై ఆచితూచి స్పందించాలని Read More …

రాజధాని రైతులు పోరాటానికి సిద్ధంగా ఉండాలి — పవన్‌ కళ్యాణ్

అమరావతి అక్టోబర్ 30 pesms మీడియా సర్వీసెస్ : బహుళ పంటలు పండే భూములు కాపాడుకునేందుకు రాష్ట్ర రాజధాని రైతులు పోరాటానికి సిద్ధంగా ఉండాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ట్వీట్‌ చేశారు. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం రాజధానిలో మరో 2,400 ఎకరాలను సేకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంటోందంటూ ఆంగ్ల పత్రికలో Read More …

ఇప్పుడేం సమాధానం చెబుతారు బాబూ — వైఎస్సార్‌ సీపీ

విజయవాడ అక్టోబర్ 29 pesms మీడియా సర్వీసెస్ :  ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని హత్యచేసేందుకే ఆయనపై దాడి జరిగిందని రిమాండ్‌ రిపోర్ట్‌లో స్పష్టమైన నేపథ్యంలో చంద్రబాబుకు వంతపాడుతూ తప్పుడు ప్రకటన చేసిన డీజీపీ ఠాకూర్‌ లెంపలేసుకుని.. వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌ డిమాండ్‌ చేశారు. అసత్య ప్రచారాలు చేసిన Read More …

సీఎం నివాసం వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం

అమరావతి అక్టోబర్ 29 pesms మీడియా సర్వీసెస్ : సీఎం చంద్రబాబు నాయుడు నివాసం వద్ద ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. తన భర్తకు ప్రమాదం జరిగినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదనతో ఒంటిపై పెట్రోల్‌ పోసుకుంది. అక్కడున్న భద్రత సిబ్బంది అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. వివరాలు.. యనమలకుదురుకు చెందిన వెలగపూడి సీత అనే మహిళ సోమవారం Read More …

రిమాండ్‌ రిపోర్ట్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష

 అమరావతి  అక్టోబర్ 28 pesms మీడియా సర్వీసెస్ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన దాడి ముమ్మాటికీ హత్యాయత్నమేనని రిమాండ్‌ రిపోర్ట్‌ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని తేలాయి. వైఎస్‌ జగన్‌ అప్రమత్తంగా లేకుంటే కత్తి గొంతులో Read More …

గవర్నర్ల వ్యవస్థ వల్ల ఉపయోగం ఏమిటి — సీఎం చంద్రబాబు

 అమరావతి అక్టోబర్ 27 pesms మీడియా సర్వీసెస్ : ‘‘రాష్ట్ర గవర్నర్‌ డీజీపీకి ఫోన్‌ చేసి, ఘటన గురించి అడుగుతారా? అధికారులకు గవర్నర్‌ నేరుగా ఫోన్లు చేయవచ్చా? కేంద్రానికి గవర్నర్‌ సీక్రెట్‌ ఏజెంట్‌గా ఉండడం తప్ప ఆ వ్యవస్థ వల్ల ఉపయోగం ఏమిటి?’’ అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. శుక్రవారం ఉండవల్లిలో సీఎం నివాసం వద్ద ప్రజావేదిక హాలులో రెండో Read More …

జగన్‌పై దాడి..అంతా డ్రామా — సిఎం చంద్రబాబు

అమరావతి  అక్టోబర్ 26 pesms మీడియా సర్వీసెస్ : విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన దాడి ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు డ్రామాగా అభివర్ణించారు. దాడి జరిగిన తర్వాత ఫిర్యాదు చేయకుండా జగన్‌ వెంటనే హైదరాబాద్‌కు ఎలా వెళ్లారని ప్రశ్నించారు. ఆయన బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని విమర్శించారు. చంద్రబాబు గురువారం రాత్రి ఉండవల్లిలోని గ్రీవెన్స్‌ హాల్‌లో మీడియాతో Read More …

ఘటన ప్రాంతం మా పరిధిలోది కాదు — డీజీపీ ఆర్పీ ఠాకూర్‌

అమరావతి అక్టోబర్ 26 pesms మీడియా సర్వీసెస్ : ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగిన ప్రాంతం తమ పరిధిలోనిది కాదని, అది సీఐఎస్‌ఎఫ్‌ పరిధిలోనిదని డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ చెప్పారు. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగిన తర్వాత మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. జగన్‌పై హత్యాయత్నం చేసిన జానిపల్లి శ్రీనివాసరావు Read More …

వైఎస్‌ జగన్‌పై దాడి దారుణం — కాంగ్రెస్‌

అమరావతి  అక్టోబర్ 25 pesms మీడియా సర్వీసెస్ : వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో జరిగిన దాడి దారుణమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఉమెన్‌ చాందీ, ఏపీసీసీ అధ్యక్షులు ఎన్‌ రఘువీరా రెడ్డిలు వ్యాఖ్యానించారు. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ దాడిపై సమగ్ర విచారణ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను Read More …

డీజీపీని కలిసిన వైఎస్సార్‌ సీపీ నేతలు

విజయవాడ అక్టోబర్ 25 pesms మీడియా సర్వీసెస్ : ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై నిష్పాక్షికంగా విచారణ జరిపించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్‌ చేశారు. వైఎస్‌ జగన్‌పై దాడి జరిగిన వెంటనే వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేశ్‌తోపాటు పార్టీ నాయకులు వెలంపల్లి శ్రీనివాస్‌, Read More …

అగ్రిగోల్డ్‌ ఆస్తులు రూ.3,861 కోట్లు

అమరావతి అక్టోబర్ 24 pesms మీడియా సర్వీసెస్ : అగ్రిగోల్డ్‌ ఆస్తుల విలువ రిజిస్ట్రేషన్‌ ధరల ఆధారంగా రూ.3,861 కోట్ల 76 లక్షలని సీఐడీ ఎస్పీ ఉదయ్‌భాస్కర్‌ వెల్లడించారు. అగ్రిగోల్డ్‌ ఆస్తుల వ్యవహారంలోను, డిపాజిటర్లకు న్యాయం చేయడంలోను రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో మంగళగిరిలోని పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. Read More …

పెద్దాపురం నుంచే పోటీ చేస్తా — హోం మంత్రి చినరాజప్ప

అమరావతి అక్టోబర్ 24 pesms మీడియా సర్వీసెస్ : తిట్లీ తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెలాఖరు కల్లా సాధారణ పరిస్థితులు తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్‌ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తుపాన్‌ వల్ల పెద్ద ఎత్తున ​నష్టం సంభవించిందని, రూ. 4,372 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నట్టు Read More …

ఏపీలో ఐపీఎస్‌ల బదిలీలు

అమరావతి అక్టోబర్ 23  pesms మీడియా సర్వీసెస్ : ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐపీఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. 14 మందికి స్థానచలనం కల్పిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సంఖ్య      ఐపీఎస్‌ అధికారి పేరు              హోదా    Read More …

మూడో రోజుకు చేరిన రాజధాని రైతుల దీక్ష

అమరావతి అక్టోబర్ 23  pesms మీడియా సర్వీసెస్ : తమ భూములను ఎంజాయ్‌మెంట్‌ సర్వేలో నమోదు చేయాలంటూ రాజధాని అసైండ్‌ భూముల రైతులు చేపట్టిన అమరణ నిరహార దీక్ష మంగళవారం మూడో రోజుకి చేరకుంది. దీక్ష చేపట్టిన రైతుల షుగర్‌, బీపీ లెవల్స్‌ పడిపోవడంతో వారి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన Read More …

అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా బీజేపీ దీక్ష

విజయవాడ అక్టోబర్ 22  pesms మీడియా సర్వీసెస్ :  అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ బీజేపీ శాఖ రిలే నిరహార దీక్షలు ప్రారంభించింది. నేటి నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా రిలే దీక్షలు చేయనున్నారు. ఈ మేరకు బీజేపీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌ విజయవాడలోని ధర్నా చౌక్‌లో సోమవారం Read More …

తత్కాల్‌ పాస్‌పోర్ట్‌కు ఐఏఎస్, ఐపీఎస్‌ లేఖలు అక్కర్లేదు — డీఎస్‌ఎస్‌ శ్రీనివాసరావు

అమరావతి అక్టోబర్ 21  pesms మీడియా సర్వీసెస్ : తత్కాల్‌ పద్ధతిలో పాస్‌పోర్ట్‌ తీసుకోవాలంటే ఒకప్పుడు ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. లేదంటే విదేశీ ప్రయాణం వాయిదా వేసుకోవాలి. అంతకుమించి మార్గం లేదు. సడలించిన నిబంధనల ప్రకారం ఇప్పుడా అధికారుల అవసరం లేదు. మూడు ధృవపత్రాలు సమర్పించి రూ.2,500 ఫీజు చెల్లిస్తే చాలు మూడురోజుల్లో Read More …

ఎపి లో ఐపీఎస్‌ల బదిలీకి రంగం సిద్ధం

అమరావతి అక్టోబర్ 20  pesms మీడియా సర్వీసెస్ : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పలు జిల్లాల ఎస్పీలు, పలు శాఖల్లోని ఐపీఎస్‌ అధికారుల బదిలీకి రంగం సిద్ధమైంది. తమకు అనుకూలంగా ఉండేలా జిల్లా ఎస్పీలను నియమించుకునే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. రాష్ట్రంలో దాదాపు 20 మంది ఐపీఎస్‌ అధికారులను మార్చే అవకాశం ఉందని సమాచారం. చంద్రబాబు అధికారం చేపట్టాక Read More …

చంద్రబాబు బినామీ సీఎం రమేష్‌ — బీజేపీ

విజయవాడ  అక్టోబర్ 19  pesms మీడియా సర్వీసెస్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి బినామీ సీఎం రమేష్‌ అని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహా రావు ఆరోపించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జీవీఎల్‌ విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌ దిగజారుడు మనిషని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం రమేష్‌ను రాజ్యసభకు పంపినందుకు చంద్రబాబు Read More …

సీఎం రమేష్‌ రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌ కంపెనీలో అవకతవకలు

న్యూఢిల్లీ  అక్టోబర్ 19  pesms మీడియా సర్వీసెస్ :  టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌పై ఐటీ దాడుల్లో రూ.100 కోట్ల వరకూ అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. రమేష్‌కు చెందిన నిర్మాణ రంగ కంపెనీ రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌రూ.74 కోట్ల నిధులను గుర్తించలేని లావాదేవీల ద్వారా దారిమళ్లించినట్టు, రూ.25 కోట్ల బిల్లులను ఐటీ అధికారులు అనుమానాస్పదమైనవిగా కనుగొన్నట్టు ‘ఇండియన్‌ Read More …