బిల్ట్ ఎక్స్ పో ప్రదర్శన ఒక అవగాహన కల్గిస్తుంది — శ్యాం ప్రసాద్ లాల్

కరీంనగర్ టౌన్ డిసెంబర్ 07 PESMS  మీడియా సర్వీసెస్ : నూతనంగా భవనాలు నిర్మించుకునేవారికి బిల్ట్ ఎక్స్ పో ప్రదర్శన ఎంతగానో ఉపయోగపడుతుంది . దీని వలన వారికి ఒక అవగాహన వస్తుందని కరీంనగర్ జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు . అసోసియేషన్ అఫ్ సివిల్ ఇంజినీర్స్ [ ఇండియా ] కరీంనగర్ Read More …

మొక్కలు నాటిన మున్సిపల్‌ కమీషనర్‌ జగదీశ్వర్‌

మెట్‌పల్లి డిసెంబర్ 07 PESMS  మీడియా సర్వీసెస్ : మెట్‌పల్లి మున్సిపల్‌ కమీషనర్‌ జగదీశ్వర్‌ రెడ్డి ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు విసిరిన సవాలును స్వీకరించి గ్రీన్‌చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు. శనివారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో రెండు మొక్కలు, కూరగాయల మార్కెట్‌లో మూడు మొక్కలు నాటి గ్రీన్‌ చాలెంజ్‌ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ మేనేజర్‌ మోహన్‌, Read More …

జేసీ వనజాదేవిని కలిసిన ఆర్జీ2 జీఎం సురేశ్‌

యైటింక్లయిన్‌కాలనీ డిసెంబర్ 05 PESMS  మీడియా సర్వీసెస్ : ఆర్జీ2 ఏరియా జీఎం సురేశ్‌ పెద్దపల్లి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వనజాదేవిని కలిశారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో జేసీని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ కార్యక్రమంలో ఏరియా సీనియర్‌ ఎస్టేట్‌ అధికారి శ్రీనివాస్‌, సీనియర్‌ సెక్యురిటీ అధికారి పీవీ రమణ తదితరులు పాల్గొన్నారు.

కరీంనగర్ జిల్లా కలెక్టర్ కు అవార్డ్

కరీంగనర్ కలెక్టరేట్ డిసెంబర్ 04 PESMS  మీడియా సర్వీసెస్ : టి ఎస్ ఐ పాస్ ను కరీంనగర్ లో విజయవంతంగా అమలు చేస్తూ జిల్లాను ముందు వరసలో వుంచినందుకు గాను కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్పరజ్ అహ్మద్  హైద్రాబాద్ లో అవార్డ్ అందుకున్నారు . బుధవారం  రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటిఆర్ చేతులమీదుగా కలెక్టర్ ఈ అవార్డ్ ను Read More …

స్వచ్ భారత్ లో బాగస్వామ్యం కావాలి — జగదీశ్వర్‌ గౌడ్‌

మెట్‌పల్లి డిసెంబర్ 03 PESMS  మీడియా సర్వీసెస్ : స్వచ్ భారత్ కార్యక్రమంలో  అందరు  బాగస్వామ్యం కావాలని కమిషనర్‌ జగదీశ్వర్‌ గౌడ్‌ పిలుపునిచ్చారు . మంగళవారం మెట్‌పల్లి పట్టణంలోని 21, 22 వార్డుల్లో కమిషనర్‌ పర్యటించి తడి, పొడి చెత్తను వేర్వేరుగా నిల్వ చేయాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంటిలోని చెత్తను రోడ్లపై వేయవద్దని, ట్రాక్టర్‌కు , ఆటోకు చెత్తను అందించాలని Read More …

కనగర్తి లో పౌరహక్కుల దినోత్సవం

ఇల్లందకుంట నవంబర్ 30 PESMS  మీడియా సర్వీసెస్ : ఇల్లందకుంట మండలంలోని కనగర్తి గ్రామంలో పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు.  తహసీల్దార్‌ సురేఖ, రూరల్‌ సీఐ అడ్డూరి రాములు, ఎస్‌ఐ ప్రవీన్‌రాజ్‌ శనివారం పౌరహక్కుల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు .అంటరానితనం, కులవివక్షపై అవగాహన కల్పించారు. ప్రజలంతా కలిసి మెలసి ఉండాలని, వివక్ష చూపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు .  Read More …

పరిశుభ్రతతోనే ఆరోగ్యవంతమైన జీవితం — డీఎంహెచ్‌ఓ ప్రమోద్‌

నిట్టూరు [పెద్దపల్లి] నవంబర్ 23 PESMS  మీడియా సర్వీసెస్ : ఆరోగ్యవంతమైన జీవితం పరిశుభ్రతతో సాధ్యమవుతుందని పెద్దపల్లి జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ ప్రమోద్‌కుమార్‌ తెలిపారు . శనివారం మండలంలోని నిట్టూరు గ్రామంలో విషజ్వరాలు ప్రబలుతున్న దృష్ట్యా డీఎంహెచ్‌ఓ ఇంటింటికి తిరిగి ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంట్లో దోమలు వృద్ధి చెందకుండా నీటి నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు . అనంతరం వైద్య శిబిరం Read More …

మంత్రి గంగులను కలిసిన ఆర్బన్ తహసీల్దార్ వెంకట్ రెడ్డి

కరీంనగర్ కలెక్టరేట్ నవంబర్ 22 PESMS  మీడియా సర్వీసెస్ : కరీంనగర్ ఆర్బన్ తహసిల్దార్ గా భాధ్యతలు చేపట్టిన వెంకట్ రెడ్డి శుక్రవారం ఉదయం మంత్రి క్యాంపు కార్యాలయంలో తెలంగాణా రాష్ట్ర  పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ను మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా  తహసీల్దార్, సిబ్బంది మంత్రి కి పుష్పగుచ్ఛం అందజేశారు .

సీసీఐ కొనుగోలు కేంద్రం ప్రారంభం

పెద్దపల్లి నవంబర్ 21 PESMS  మీడియా సర్వీసెస్ :  మండలంలోని రాఘవాపూర్‌ శ్రీరామ జిన్నింగ్‌మిల్‌లో గురువారం సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. సీసీఐ భరత్‌ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ రైతులు సీసీఐ కేంద్రంలో పత్తిని విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు . రైతులు పత్తిలో నీళ్లు చల్లకుండా నేరుగా సీసీఐ కేంద్రాలకు తీసుకురావాలని, అలాగైతేనే కొనుగోలు చేస్తారన్నారు. Read More …

సుల్తానాబాద్‌లో పర్యటించిన సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌

సుల్తానాబాద్‌  నవంబర్ 19 PESMS  మీడియా సర్వీసెస్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా సహకరిస్తే గ్రామాలు పట్టణ శోభను సంతరించుకుంటాయని సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని సుద్దాల గ్రామంలోని వానరవనంను పరిశీలించేందుకు వచ్చిన ఆమె ప్రజాప్రతినిధులను, ఉపాధిహామీ సిబ్బందిని అభినందించారు. జిల్లా కలెక్టర్‌ శ్రీదేవసేనతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వానర Read More …