మృతుని కుటుంబానికి ఎమ్మెల్యే దాసరి పరామర్శ

పెద్దపల్లి అక్టోబర్ 15 PESMS  మీడియా సర్వీసెస్ :  పెద్దపల్లి మండలంలోని మారేడుగొండ గ్రామంలో గుండెపోటుతో మృతిచెందిన ఉమ్మల్ల కుమార్‌ కుటుంబాన్ని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పరామర్శించారు. మంగళవారం కుమార్‌ కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి వ్యక్తం చేసి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట పలువురు తెరాస నాయకులు, తదితరులు ఉన్నారు.

ప్రాణ త్యాగాలు చేసిన ఆర్టీసి కార్మికులకు నివాళులు

కరీంనగర్ టౌన్ అక్టోబర్ 14 PESMS  మీడియా సర్వీసెస్ : ఆర్టీసి సమస్యల సాధనకోసం ప్రాణాలు అర్పించిన ఆర్టిసి డ్రైవర్ దేవిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి , కండక్టర్ సురేందర్ గౌడ్ లకు యూత్ కాంగ్రెస్ ఘన నివాళులు అర్పించింది . సోమవారం సాయంత్రం తెలంగాణా చౌక్ లో కరీంనగర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో  కార్యక్రమాన్ని Read More …

ఖమ్మం చేరుకున్న శ్రీనివాస్‌రెడ్డి మృతదేహాం

ఖమ్మం అక్టోబర్ 13 PESMS  మీడియా సర్వీసెస్ : ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఆత్మహత్య చేసుకున్న శ్రీనివాస్‌రెడ్డి మృతదేహాం కొద్దిసేపటి క్రితం ఖమ్మంకు చేరుకుంది. శనివారం రోజున ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన శ్రీనివాస్‌రెడ్డి‌.. హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో ఆపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందారు. దీంతో ఆయన Read More …

పాము కాటుతో మృతి చెందిన రైతు గాజుల రాజం

జగిత్యాల అక్టోబర్ 13 PESMS  మీడియా సర్వీసెస్ :  మెట్ పల్లి మండలం జగ్గసాగర్ గ్రామానికి చెందిన గాజుల రాజం (60) అనే రైతు ఆదివారం  పాము కాటు తో మృతి చెందాడు.. కుటుంభ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం.. మొక్కజొన్న చెనులో పనులు చేస్తుండగా పాము కాటు వేయడంతో ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలో మృతి చెందాడని తెలిపారు. Read More …

అయోధ్య రామారావుకు ఎమ్మెల్యే దాసరి నివాళి

కరీంనగర్‌ అక్టోబర్ 12 PESMS  మీడియా సర్వీసెస్ : కరీంనగర్‌లోని వాణినికేతన్‌ విద్యా సంస్థల వ్యవస్థాపకులు అయోధ్య రామారావుకు పెద్దపల్లి ఎమ్మెల్యే, ట్రినిటి విద్యా సంస్థల అధినేత దాసరి మనోహర్‌రెడ్డి నివాళులర్పించారు. రామారావు అనారోగ్యంతో శుక్రవారం మృతిచెందగా శనివారం ఆయన స్వగృహంలో పార్ధివదేహానికి ఎమ్మెల్యే దాసరి పూలమాల వేసి నివాళులు అర్పించారు .  అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.

గుండెపోటుతో ఆటోడ్రైవర్‌ ఉమ్మల్ల కుమార్‌ మృతి

పెద్దపల్లి అక్టోబర్ 10 PESMS  మీడియా సర్వీసెస్ : పెద్దపల్లి మండలంలోని మారేడుగొండ గ్రామానికి చెందిన ఉమ్మల్ల కుమార్‌ (37) అనే ఆటో డ్రైవర్‌ గుండెపోటుతో మృతిచెందాడు. ఉదయం తన ఇంటి ముందు గుండెపోటుకు గురైన కుమార్‌ అక్కడికక్కడే మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

తెలంగాణా బిల్లులో కీలక పాత్ర పోషించిన’ సుష్మా’ — వివేక్

ఓయు క్యాంపస్ [ హైదరాబాద్ ] ఆగష్టు 31 PESMS  మీడియా సర్వీసెస్ : తెలంగాణా బిల్లు తయారు చేయడంలో తెలంగాణా చిన్నమ్మ [ సుష్మా స్వరాజ్ ] కీలక పాత్ర పోషించారని పెద్దపల్లి మాజీ ఎంపి , బిజెపి నేత గడ్డం వివేక్ వెంకటస్వామి గుర్తు చేశారు . శనివారం ఉస్మానియా యునివర్సిటీ క్యాంపస్ Read More …

జైట్లీ మృతిపట్ల మంత్రి ఈటల సంతాపం

హైదరాబాద్ ఆగష్టు 24 PESMS  మీడియా సర్వీసెస్ : కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతిపట్ల తెలంగాణా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. జైట్లీ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జీఎస్టీ  సమావేశాల సందర్భంగా కౌన్సిల్ సమావేశాల్లో ఆయనతో ఉన్న అనుబంధాన్ని మంత్రి గుర్తు Read More …

చల్మెడ కిషన్‌రావుకు ఎంపీ సంజయ్‌ ఘన నివాళి

సిరిసిల్ల ఆగష్టు 20 PESMS  మీడియా సర్వీసెస్ : విజయ పాలకేంద్ర చైర్మన్‌ చల్మెడ రాజేశ్వర్‌రావు తండ్రి కిషన్‌రావు మృతిచెందడంతో సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బల్కంపేటలో కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ నివాళులర్పించారు. మంగళవారం కిషన్‌రావు చిత్రపటానికి పూలమాల వేసి ఎంపీ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు .

మాజీ ప్రధానమంత్రి వాజ్ పేయికి నివాళి

కరీంనగర్ ఆగష్టు 16 PESMS  మీడియా సర్వీసెస్ : కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ శుక్రవారం పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీతో పాటు నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.