ఆర్టీసీ సమ్మె… ఓయూ విద్యార్థుల అరెస్ట్‌

హైదరాబాద్‌ అక్టోబర్ 17 PESMS  మీడియా సర్వీసెస్ : తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 13వ రోజు కొనసాగుతోంది. ఆర్టీసీ కార్మికులతో పాటు వారికి మద్దతుగా ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, స్టూడెంట్‌ యూనియన్లు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాయి. ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. ఆర్ట్స్ కాలేజీ నుంచి Read More …

సిఎం కెసిఆర్ రాజీనామా చేయాలి — వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్ అక్టోబర్ 13 PESMS  మీడియా సర్వీసెస్ : ఆర్టీసి డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతికి నైతిక భాద్యత వహిస్తూ సిఎం పదవికి కెసిఆర్ రాజీనామా చేయాలని పెద్దపల్లి మాజీ ఎంపి ,బిజెపి నేత గడ్డం వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు .  ఆదివారం  మీడియా తో మాట్లాడుతూ .. ఆర్టీసి కార్మికులవి న్యాయమైన డిమాండ్లని అన్నారు . Read More …

చిన్నమెసేజ్‌తో మహిళల భద్రతకు శ్రీరామ రక్ష

హైదరాబాద్‌ అక్టోబర్ 08 PESMS  మీడియా సర్వీసెస్ : మహిళల భద్రత కోసం పోలీసులు మరో వినూత్న ఆవిష్కరణకు రూపకల్పన చేశారు. క్యాబ్‌లలో ప్రయాణించే మహిళలు, పౌరుల భద్రతకు ఆ సర్వీసులను పోలీసు ప్యాట్రోల్‌ వాహనాల తో అనుసంధానించారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఈ వ్యవస్థను ప్రవేశ పెట్టినట్లు సోమవారం జరిగిన మీడియా భేటీలో డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. Read More …

9న మద్యం దుకాణాల టెండర్‌ నోటిఫికేషన్‌

హైదరాబాద్‌ అక్టోబర్ 08 PESMS  మీడియా సర్వీసెస్ : రాష్ట్రంలో మద్యం దుకాణాల నిర్వహణకు ఈ నెల 9న టెండర్‌ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూపొందించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం నవంబర్‌ 1న కొత్త మద్యం దుకాణాల నిర్వహణకు ఈ నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు. దీని ప్రకారం ఈ నెల 9 నుంచి 16 వరకు Read More …

ఆర్టీసీ సమ్మె… కార్మికుల ఉద్యోగాలకు ఎసరు

హైదరాబాద్‌ అక్టోబర్ 08 PESMS  మీడియా సర్వీసెస్ : ఆర్టీసీ కార్మికులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ప్రకటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేసీఆర్‌.. సంస్థలో ఇక మిగిలింది1200 మంది ఉద్యోగులు మాత్రమే అని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం విధించిన గడువులోగా విధుల్లో చేరని వారిని ఇక ఉద్యోగులుగా గుర్తించమని Read More …

ముగిసిన ప్రభుత్వం డెడ్‌లైన్‌.. పట్టించుకోని కార్మికులు

హైదరాబాద్ అక్టోబర్ 05 PESMS  మీడియా సర్వీసెస్ : తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డెడ్‌లైన్ ముగిసింది. శనివారం సాయంత్రం 6 గంటల్లోపు విధులకు రానివారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కేవలం 160 మంది మాత్రమే విధులకు హాజరైనట్టు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లాలో సాయంత్రం 6 గంటల వరకు ఒక్క Read More …

కొత్త మద్యం పాలసీ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్‌ అక్టోబర్ 03 PESMS  మీడియా సర్వీసెస్ : తెలంగాణ ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని ప్రకటించింది. నూతన మద్యం విధానానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను గురువారం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ విడుదల చేశారు.  నవంబర్ 1 నుంచి 2021 అక్టోబర్‌ వరకు కొత్త మద్యం విధానం అమలులో ఉంటుంది. జనాభా ప్రాతిపదికన లైసెన్స్‌ ఫీజులు ఖరారు Read More …

హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం

హైదరాబాద్‌ సెప్టెంబర్ 25 PESMS  మీడియా సర్వీసెస్ : నగరాన్ని భారీ వర్షం వణికిస్తోంది. మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ ఏకధాటిగా కురిసిన వర్షానికి భాగ్యనగరం తడిసిముద్దయిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం కాస్తా తెరపి ఇచ్చినా.. సాయంత్రానికి మళ్లీ భారీ వర్షం మొదలైంది. నగరంలోని పలు ప్రాంతాలలో వాన దంచి కొడుతోంది. ముషిరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌ Read More …

ఉప రాష్ట్రపతిని కలిసిన వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్  సెప్టెంబర్ 24 PESMS  మీడియా సర్వీసెస్ : భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును పెద్దపల్లి మాజీ ఎంపి , బిజెపి నేత గడ్డం వివేక్ వెంకటస్వామి కలిశారు . మంగళవారం వివేక్ ఉప రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలిసిన పుష్పగుచ్చం అందజేసి శాలువకప్పి సత్కరించారు .  అనంతరం తెలంగాణా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది .

రేపు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం

హైదరాబాద్‌ సెప్టెంబర్ 22 PESMS  మీడియా సర్వీసెస్ : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కె. చంద్రశేఖర్‌ రావు సోమవారం హైదరాబాద్‌లో భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌  సోమవారం మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాసమైన ప్రగతి భవన్‌కు చేరుకుంటారు. ఇక్కడే వీరిద్దరూ సమావేశమై వివిధ అంశాలపై చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం – 2014 Read More …