ఆర్టీసీ బస్సు ఢీ కొని వ్యక్తి మృతి

జగిత్యాల అక్టోబర్ 20 PESMS  మీడియా సర్వీసెస్  :  కరీంనగర్ రీజియన్ పరిధిలోని జగిత్యాల జిల్లా కోరుట్ల డిపోకు చెందిన బస్ నిజామాబాద్ కు వెళుతుండగా నిజామాబాద్ సమీపంలోని సుజిత్ ఫ్యాక్టరీ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఆదివారం జరిగిన  ఈ ఘటనలో ఒకరి మృతి చెందారు. బస్సును తాత్కాలిక డ్రైవర్ నడుపుతున్నాడు. తాత్కాలిక డ్రైవర్ ల వలన ప్రమాదాలు Read More …

ధర్మపురిలో వెంకటేశ్వరస్వామికి క్షీరాభిషేకం

ధర్మపురి అక్టోబర్ 18 PESMS  మీడియా సర్వీసెస్ : ధర్మపురిలోని అనుబంధ ఆలయమైన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం వార్షిక క్షీరాభిషేకం నిర్వహించారు. స్వామి వారికి పంచోపనిషత్‌లతో అభిషేకం, హారతి, మంత్రపుష్పం కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఉప ప్రదాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాస్‌, నేరెళ్ల శ్రీధరచారి, నేరెళ్ల మోహన్‌, దేవస్థాన సూపరింటెండెంట్‌ కిరణ్‌కుమార్‌, సీనియర్‌ Read More …

పాము కాటుతో మృతి చెందిన రైతు గాజుల రాజం

జగిత్యాల అక్టోబర్ 13 PESMS  మీడియా సర్వీసెస్ :  మెట్ పల్లి మండలం జగ్గసాగర్ గ్రామానికి చెందిన గాజుల రాజం (60) అనే రైతు ఆదివారం  పాము కాటు తో మృతి చెందాడు.. కుటుంభ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం.. మొక్కజొన్న చెనులో పనులు చేస్తుండగా పాము కాటు వేయడంతో ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలో మృతి చెందాడని తెలిపారు. Read More …

మరో యాదాద్రిగా ధర్మపురి — మంత్రి కొప్పుల ఈశ్వర్

ధర్మపురి అక్టోబర్ 12 PESMS  మీడియా సర్వీసెస్ : ధర్మపురి క్షేత్రాన్ని మరో యాదాద్రిగా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ కృతనిశ్చయంతో ఉన్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు .  శనివారం ధర్మపురిలో విలేకరులతో ఆయన మాట్లాడారు .  ధర్మపురలి క్షేత్రాన్ని అభివృద్ది చేయాలన్న ప్రజల డిమాండ్ ను నెరవేర్చేందుకు టీఆర్ఎస్ సర్కార్ కృత నిశ్చయంతో ఉందని  స్పష్టం చేశారు . ధర్మపురి క్షేత్రం Read More …

బైక్‌ను ఢీకొన్న లారీ… ఇద్దరి దుర్మరణం

మెట్‌పల్లి అక్టోబర్ 11 PESMS  మీడియా సర్వీసెస్ : మెట్‌పల్లి పట్టణంలోని బస్‌ డిపో వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. శుక్రవారం మల్లాపూర్‌ మండలం గుండంపల్లికి చెందిన గణశ్‌, లక్ష్మిలు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వేగంగా వచ్చిన లారీ వీరి పై నుంచి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు.

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి — ఎల్‌.రమణ

జగిత్యాల అక్టోబర్ 10 PESMS  మీడియా సర్వీసెస్ : ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని టీడీపీ నేత ఎల్‌.రమణ అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు చేసిన సేవను మర్చిపోకూడదన్నారు. జేఏసీ నేతలతో సీఎం చర్చించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి

మెట్‌పల్లి అక్టోబర్ 10 PESMS  మీడియా సర్వీసెస్ : టీఎస్‌ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్‌ చేస్తూ కార్మికులు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాకు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు జువ్వాడి కృష్ణారావు, జువ్వాడి నర్సింగరావులు మద్దతు తెలిపారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

సమ్మెతో నిలిచిన బస్సులు

మెట్‌పల్లి అక్టోబర్ 05 PESMS  మీడియా సర్వీసెస్ : ఆర్టీసీ కార్మికుల సమ్మెతో మెట్‌పల్లి ఆర్టీసీ డిపోలో అర్ధరాత్రి నుంచి బస్సులు నిలిచిపోయాయి.  ఉదయం పూట కరీంనగర్‌, హైదరాబాద్‌, నిజామాబాద్‌ వెళ్లే ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించడంతో ఇదే అదనుగా భావించిన ప్రైవేటు వాహనదారులు అందిన కాడికి దండుకుంటున్నారు. ఎట్టకేలకు స్పందించిన పోలీసులు, Read More …

ఘనంగా జువ్వాడి రత్నాకర్‌రావు జన్మదిన వేడుకలు

మెట్పల్లి  అక్టోబర్ 04 PESMS  మీడియా సర్వీసెస్  :  మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు జన్మదిన వేడుకలను కాంగ్రెస్‌ నాయకులు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం పట్టణంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండీ ఖుతుబోద్దీన్‌ ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో సీనియర్‌ నాయకులు జెట్టి లింగం, అంజిరెడ్డి, కుర్మ దేవయ్య, Read More …

ఈనెల 5న ఎంపీ అరవింద్‌ పాదయాత్ర — జెఎన్‌ వెంకట్‌

మెట్‌పల్లి అక్టోబర్ 03 PESMS  మీడియా సర్వీసెస్ : మహాత్మగాధీ జయంతి సందర్భంగా పీఎం మోడీ పిలుపు మేరకు నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ ఈనెల 5వ తేదీన 150 కి.మీ పాదయాత్ర చేపట్టనున్నట్లు బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ జెఎన్‌ వెంకట్‌ వెల్లడించారు .  బుధవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గంలోని పలు Read More …