ఆర్టీసీ కార్మికుల రాస్తారోకో

ఎల్లారెడ్డిపేట అక్టోబర్ 21 PESMS  మీడియా సర్వీసెస్ : ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మండలంలోని గొల్లపల్లి బస్టాండ్‌ వద్ద సిరిసిల్ల- కామారెడ్డి రహదారిపై ఆర్టీసీ కార్మికులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. డ్రైవర్లు, కండక్టర్లు, కంట్రోలర్స్‌, కార్మికులు రోడ్డుపై బైఠాయించడంతో వీరికి మద్దతుగా కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ, ఎమ్మార్పీఎస్‌, బీడీ కార్మిక సంఘం, హమాలీ కార్మిక Read More …

ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారికి ఘనస్వాగతం

ఎల్లారెడ్డిపేట అక్టోబర్ 12 PESMS  మీడియా సర్వీసెస్ : ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్‌ గ్రామానికి వచ్చిన ప్రభుత్వ ప్రధాన సలహాదారు కేవీ రమణాచారికి ఎల్లారెడ్డిపేట సర్పంచ్‌ నేవూరి వెంకట్‌రెడ్డి శనివారం ఘన స్వాగతం పలికారు. ఆయనను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. గ్రామంలోని పురాతన ఆలయానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. సుదీర్ఘకాలం తర్వాత స్వగ్రామానికి రమణచారి రావడం పట్ల గ్రామస్తులు Read More …

 ఎల్లారెడ్డిపేటలో గొర్రెల యూనిట్ల పంపిణీ

ఎల్లారెడ్డిపేట అక్టోబర్ 11 PESMS  మీడియా సర్వీసెస్ : ఎల్లారెడ్డిపేట పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో చైర్మన్‌ గుండారపు కృష్ణారెడ్డి గొర్రెల పెంపకం యూనిట్లకు సంబంధించి చెక్కులను పంపిణీ చేశారు. హరిదాస్‌నగర్‌కు చెందిన వట్టెల దేవవ్వకు ఆరు యూనిట్లకుగాను 126 గొర్రెల కొనుగోలుకు రూ. 6లక్షల చెక్కును చైర్మన్‌ అందజేశారు. రైతులు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో Read More …

ప్రాజెక్ట్ ల నాణ్యతల పై సిబిఐ విచారణ చేపట్టాలి – వివేక్ వెంకటస్వామి

కొదురుపాక [ సిరిసిల్లా ] అక్టోబర్ 07 PESMS  మీడియా సర్వీసెస్ : ప్రాజెక్ట్ ల నాణ్యత లోపాల పై సిబిఐ విచారణ చేపట్టాలని పెద్దపల్లి మాజీ ఎంపి , బిజెపి నేత గడ్డం వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు .  సిరిసిల్లా జిల్లా కొదురుపాక మిడ్ మానేర్ కట్ట కు సిఫేజ్ ఏర్పడిన ప్రాంతాన్ని సోమవారం వివేక్ Read More …

రోడ్డు కిరువైపులా నాటిన మొక్కలు

ఎల్లారెడ్డిపేట అక్టోబర్ 03 PESMS  మీడియా సర్వీసెస్ : మండలంలోని అగ్రహారం గ్రామంలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా రహదారులకు ఇరువైపులా జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు, ఎంపీపీ పిల్లి రేణుక కిషన్‌లు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ , ఎంపీటీసీ తిరుపతి, నాయకులు కుంభాల మల్లారెడ్డి, గుండారపు కృష్ణారెడ్డి, రమేశ్‌ గౌడ్‌, వార్డుసభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

బతుకమ్మ సంబరాల పోస్టర్లు, సీడీ ఆవిష్కరణ

ఎల్లారెడ్డి పేట్ సెప్టెంబర్ 30 PESMS  మీడియా సర్వీసెస్ : ఎల్లారెడ్డి పేట్ మండల కేంద్రంలోని పాత బస్టాండ్‌ బతుకమ్మ పాయింట్‌ వద్ద తెలంగాణ జాగృతి జిల్లా కో- కన్వీనర్‌, బతుకమ్మ సంబరాల ఇన్‌చార్జి వర్ధ సతీష్‌కుమార్‌ ఆధ్వర్యంలో జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు, ఎంపీపీ పిల్లి రేణుక కిషన్‌లు బతుకమ్మ సంబరాల పోస్టర్లు, సీడీ, పాటల పుస్తకాలను ఆవిష్కరించారు. Read More …

పంచెకట్టుతొ కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ పర్యటన

ఇల్లంతకుంట సెప్టెంబర్ 23 PESMS  మీడియా సర్వీసెస్ : మండలంలోని అనంతారం, ముస్కానిపేట, కేశన్‌పల్లి, తాళ్లపల్లి, జవారీపేట గ్రామాల్లో 30 రోజుల ప్రణాళికలో భాగంగా పర్యటించిన జిల్లా కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ సోమవారం పంచెకట్టుతొ ఆకట్టుకున్నారు. డ్రెయినేజీలు, మురికి కాలువలను పరిశీలించారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి కాలినడకన వెళ్తూ పరిసరాలను పరిశీలించి మండిపడ్డారు. ఆయన వెంట డీపీఓ రవీందర్‌, ప్రత్యేక అధికారి Read More …

మొక్కల సంరక్షణ బాధ్యతగా తీసుకోవాలి

ఇల్లంతకుంట సెప్టెంబర్ 20 PESMS  మీడియా సర్వీసెస్ : మొక్కల సంరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని జడ్పీ వైస్‌ చైర్మన్‌ సిద్ధం వేణు పేర్కొన్నారు. శుక్రవారం 30 రోజుల ప్రణాళికలో భాగంగా మండలంలోని తాళ్లపల్లి గ్రామంలో హరితహారం మొక్కలను నాటారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి మొక్కలను కాపాడాలన్నారు. ఈకార్యక్రమంలో సర్పంచ్‌ ఎలుక పద్మ, కనకయ్య, ఉపసర్పంచ్‌ Read More …

యథేచ్ఛగా ఇసుక దందా కొనసాగింపు

ముస్తాబాద్ సెప్టెంబర్ 19 PESMS  మీడియా సర్వీసెస్ : పర్యావరణ పరిరక్షణ, భూగర్భ జలాల రక్షణ, భూమి కోతను నివారించే వాల్టా చట్టాన్ని తూట్లు పొడిచేలా ఇసుక మాఫియా పట్టపగలే యథేచ్ఛగా ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారు. అభివృద్ధి పనులకు వారానికి రెండు రోజులు ఇసుక రవాణా కూపన్లతో ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా అది Read More …

శ్రీరాజరాజేశ్వర జలాశయాన్ని సందర్శించిన కలెక్టర్‌

ఇల్లంతకుంట సెప్టెంబర్ 11 PESMS  మీడియా సర్వీసెస్ : ఇల్లంతకుంట, బోయినపల్లి మండలాల సరిహద్దులో నిర్మించిన శ్రీ రాజరాజేశ్వర జలాశయాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్‌ అధికారులతో కలిసి సందర్శించారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా పెద్దలింగాపూర్‌, రహీంఖాన్‌పేట, వెల్దిపూర్ పర్యటించి సమావేశాలు నిర్వహించిన అనంతరం కంది కట్కూరుకు ఆనుకొని ఉన్న మధ్యమానేరును పరిశీలించారు. ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంత Read More …