ట్రంప్‌కు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసిన ఇరాన్‌

టెహ్రన్ జూన్ 29 PESMS మీడియా సర్వీసెస్‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ :‌  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసిన ఇరాన్‌ ఆయనను అదుపులోకి తీసుకునేందుకు ఇంటర్‌పోల్‌ సహకారాన్ని అభ్యర్ధించింది. డ్రోన్‌ దాడిలో ఇరాన్‌ సైనికాధికారిని చంపినందుకు ట్రంప్‌తో పాటు పదుల సంఖ్యలో ఇతరులను నిర్బంధంలోకి తీసుకుంటామని ఇరాన్‌ ప్రకటించిందని ఓ స్ధానిక ప్రాసిక్యూటర్‌ సోమవారం వెల్లడించినట్టు ఓ వార్తాసంస్థ పేర్కొంది. ఇరాన్‌ చర్యతో ట్రంప్‌నకు అరెస్ట్‌ ప్రమాదం ముంచుకురాకున్నా ఇరాన్‌, అమెరికాల మధ్య ఈ పరిణామం ఉద్రిక్తతలను మరింత పెంచుతుందని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.