కశ్మీర్‌లో విద్యాసంస్థలు పున ప్రారంభం

శ్రీనగర్‌ ఆగష్టు 20 PESMS  మీడియా సర్వీసెస్ : కశ్మీర్‌లో సోమవారం పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే చాలా పాఠశాలల్లో విద్యార్థులు తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. శ్రీనగర్‌లో 190 ప్రాథమిక పాఠశాలలు తెరుచుకున్నప్పటికీ శాంతిభద్రతల భయంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపలేదు. అయితే బెమినాలోని పోలీస్‌ పబ్లిక్‌ స్కూల్, ఇతర కేంద్రీయ విద్యాలయాల్లో Read More …

మోదీ, ఇమ్రాన్‌ఖాన్‌తో మాట్లాడాను — అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌

వాషింగ్టన్‌ ఆగష్టు 20 PESMS  మీడియా సర్వీసెస్ : కశ్మీర్‌లో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, వాటిని సాధారణ స్థితికి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు, రాష్ట్ర విభజన నేపథ్యంలో భారత్‌- పాక్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో Read More …

పాక్‌ కాల్పుల్లో జవాన్‌ మృతి

శ్రీనగర్‌ ఆగష్టు 20 PESMS  మీడియా సర్వీసెస్ :  సరిహద్దుల్లో పాకిస్తాన్‌ కవ్వింపు చర్యలతో దుందుడుకుగా వ్యవహరిస్తోంది. జమ్ము కశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లా కృష్ణ గటి సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి పాక్‌ మంగళవారం కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిన ఘటనలో ఓ సైనిక జవాన్‌ మరణించారు. భారత సైన్యం దీటుగా ప్రతిస్పందించడంతో పాక్‌ సైనిక శిబిరాలకు భారీ నష్టం Read More …

కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం —  ఉపరాష్ట్రపతి వెంకయ్య

రిగా ఆగష్టు 20 PESMS  మీడియా సర్వీసెస్ : లాత్వియా దేశ అధ్యక్షుడు లేవిట్స్‌తో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమావేశమై రెండు దేశాల మధ్య సాంస్కృతిక, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, విద్య రంగంపై చర్చలు జరిపారు. లిథువేనియా, లాత్వియా, ఎస్టోనియాలో ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి మంగళవారం ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా  భారత- లాత్వియా దేశాల మధ్య పలు ద్వైపాక్షిక Read More …

పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి — గిరిజా శంకర్‌

అమరావతి ఆగష్టు 20 PESMS  మీడియా సర్వీసెస్ : సచివాలయ ఉద్యోగాల పరీక్షలను పకడ్బందీగా, సమర్థవంతంగా నిర్వహించాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై అధికారులకు అవగాహన కల్పించేందుకు తాడేపల్లిలో నిర్వహించిన రాష్ట్ర్రస్థాయి వర్క్‌షాపులో ఆయన మాట్లాడారు. రేపు సాయం​త్రానికి అన్ని జిల్లాల్లో స్టాంగ్‌ రూమ్‌లు సిద్ధం చేయాలన్నారు. ఈ సారి Read More …

తప్పుడు వార్తలపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌

అమరావతి ఆగష్టు 20 PESMS  మీడియా సర్వీసెస్ : ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తలను ప్రసారం చేయడంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సీరియస్‌ అయింది. పెట్టుబడిదారులు రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నట్లుగా… ఏసియన్‌ పల్ప్‌ & పేపర్‌ సంస్థ ఏపీని వీడుతున్నట్లు వచ్చిన వార్తలను ప్రభుత్వం ఖండించింది. దురుద్దేశంతో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. విషపూరితమైన Read More …

చల్మెడ కిషన్‌రావుకు ఎంపీ సంజయ్‌ ఘన నివాళి

సిరిసిల్ల ఆగష్టు 20 PESMS  మీడియా సర్వీసెస్ : విజయ పాలకేంద్ర చైర్మన్‌ చల్మెడ రాజేశ్వర్‌రావు తండ్రి కిషన్‌రావు మృతిచెందడంతో సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బల్కంపేటలో కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ నివాళులర్పించారు. మంగళవారం కిషన్‌రావు చిత్రపటానికి పూలమాల వేసి ఎంపీ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు .

విద్యార్థినితో లెక్చరర్ అసభ్యకర ప్రవర్తన

కరీంనగర్ ఆగష్టు 20 PESMS  మీడియా సర్వీసెస్ : విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఓ అధ్యాపకుడిని చితక్కొట్టిన ఘటన కరీంనగర్‌లో మంగళవారం ఉదయం సంచలనం సృష్టించింది. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం అడ్వాన్స్‌డ్ సఫ్లమెంటరీ పరీక్ష రాస్తున్న విద్యార్థినితో లెక్చరర్ వెంకటేష్ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆయనకు విద్యార్థులు దేహశుద్ధి చేశారు.  అనంతరం పోలీసులకు అప్పగించారు. మహిష్మతి ఇంజనీరింగ్ కాలేజీకి Read More …

హాస్టల్ గదిలో విద్యార్థి ఆత్మహత్య

వరంగల్ రూరల్ ఆగష్టు 20 PESMS  మీడియా సర్వీసెస్ : వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం లక్నెపల్లి శివారు లోని మంగళవారం బాలాజీ ఇంజనీరింగ్ కళాశాలలోని హాస్టల్ గదిలో దారుణం చోటుచేసుకుంది. వివరాళలోకి వెళ్తే కళాశాలలో మంగళవారం  డి ఫామ్ మొదటి సంవత్సరం విధ్యార్ధి రాహుల్ అమీన్ యువకుడు హస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య పాల్పడ్డాడు. యాజమాన్యం పోలిస్లకు Read More …

ఎస్పీ కార్యాలయం ముందు వ్యక్తి ఆత్మహత్యాయత్నం

జగిత్యాల ఆగష్టు 20 PESMS  మీడియా సర్వీసెస్ : ఓ వ్యక్తి కుటుంబ కలహాల కారణంగా ఎస్పీ కార్యాలయం వద్ద ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం ఎదుట గణేష్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. అతని ఆత్మహత్యాయత్నానికి కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది. Read More …